ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉండే ఉంటుంది. ఇందులో కేవలం రెండు ఆపరేటింగ్ సిస్టంలు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి IOS, రెండోది Android. ఐఓఎస్ యాపిల్ కేవలం ఐఫోన్ లో మాత్రమే అందిస్తుంది. అంతే కాకుండా ఐఓఎస్ కు భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్ అలా కాదు. ఐ ఓ ఎస్ తో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్ లలో భధ్రత కాస్త తక్కువ. దీంతో హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు, అడ్వైజర్ లను ఆండ్రాయిడ్ సులువుగా ఆకర్షిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ లు ఉపయోగించే వారు కాస్త జాగ్రత్త ఉండడం కూడా అవసరం. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1). బలమైన పాస్ వర్డ్ లను ఉపయోగించడం, మన ఫోన్ లాక్ చేయడానికి ఫింగర్ ప్రింట్ లేదా పేస్ లాక్ ఉపయోగిస్తాం. దీంతోపాటు బలమైన పాస్ వర్డ్ కూడా ఉండాలి. కేవలం నాలుగు అంకెల పిన్ మాత్రమే ఉపయోగిస్తే మీ ఫోన్ త్వరగా అన్లాక్ చేయడం మరింత సులభం అవుతుంది. కాబట్టి బలమైన పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవాలి.
2).అన్నోన్ సోర్స్ నుంచి థర్డ్ పార్టీ యాప్ లను ఇన్స్టాల్ చేయకూడదు. కేవలం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం. మనలో చాలా మంది గూగుల్ లో నుంచి లేదా ఏపీకే ఫైల్స్ ఉపయోగించడం వంటివి చేస్తుంటారు. అది చాలా ప్రమాదం.
3).ఫోన్ లో ఉండే సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ, సెక్యూరిటీ అప్డేట్ కానీ వస్తే వెంటనే అప్డేట్ చేయండి. ఇన్స్టాల్ చేసేందుకు కొంత సమయం పట్టినా, అది ఖచ్చితంగా మంచిది. ఎందుకంటే పాత ఆపరేటింగ్ సిస్టం ఉపయోగించేవారిని టార్గెట్ చేసుకుని దాడులు చేసే అధికారులు కూడా ఉంటారు.
4).అంతేకాకుండా ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు నిబంధనలు, పూర్తిగా చదివి యాక్సెప్ట్ చేయాలి.
5).ఏ చార్జర్ పడితే ఆ చార్జర్ ఉపయోగించడం మంచిది కాదు . ఎప్పుడూ హై క్వాలిటీ అడాప్టర్లును మాత్రమే ఉపయోగించాలి.
6). పర్సనల్ డేటా బ్యాకప్ చేయకపోవడం, మీ ఫోన్ పొరపాటున పోయినా , ఎవరైనా దొంగలించినా లేకపోతే పగిలిపోయినా అప్పుడు బ్యాకప్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. మీ డేటా మొత్తం పోతుంది. అందుకే ఫోన్ లో ఎప్పటికప్పుడు డేటాని బ్యాకప్ చేసుకోవాలి.
7).సెట్టింగ్ లో ఇన్స్టాల్ అయిన యాప్స్ చెక్ చేసుకోవడం మంచిది. సెట్టింగ్ లో వెళ్లి మీ ఫోన్ లో ఏఏ యాప్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. స్క్రీన్ మీద కనిపించకుండా హైడ్ ఉంటాయి. వాటిని సెట్టింగ్ లో చూసుకొని డిలీట్ చేసుకుంటుండాలి.
8).పాత యాప్స్ డిలీట్ చేయడం, మన ఉపయోగించని యాప్స్ ఏవైనా ఉంటే, వాటిని అన్ఇన్స్టాల్ చేయడం ఉత్తమం. అంతే కాకుండా అవుట్ డేటెడ్ యాప్స్ కూడా డిలీట్ చేయడం ఉత్తమం.
9). గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోవడం, మీ గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ కూడా పెట్టుకోవడం మార్చుకోవాలి. దీనివల్ల హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి