దివ్యాంగులకు ప్రభుత్వాలు ఎప్పుడూ ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వ  పథకాలలో వారికి రిజర్వేషన్లు కూడా కల్పించింది. అందుకోసం వారు ఒకరి మీద ఆధారపడకుండా జీవన ఉపాధి కోసం ప్రభుత్వం డబ్బులు ఇస్తూనే ఉంటుంది. అలాంటి దివ్యాంగులకు  సహాయం చేసే ప్రభుత్వాలలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా మన ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు అందించింది.


దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు ను ఉచితంగా సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి విద్య,ఉపాధికి దోహదపడేలా రూపొందించిన ఈ వాహనాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వార్షికాదాయం మూడు లక్షల లోపు కలిగిన వారు అయి ఉండాలి. అలాగే 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉండాలి.

ఇకపోతే అంగవైకల్యం 70శాతం పైగా ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఆ పై చదువులు చదివే విద్యార్థులు,వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా, ఉపాధ్యాయుల, పదోతరగతి ఉత్తీర్ణత,  కనీసం ఏడాది నుంచి పనిచేస్తున్న దివ్యాంగులకు వీటిని ఇస్తారని చెప్పుకొచ్చారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లేకుంటే ప్రత్యేక వాహనం పొందడానికి ఎంపికైన దివ్యాంగులు రెండు నెలల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి.

అలా అర్హులైన వికలాంగులను జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ ఎంపిక చేస్తుంది. అందులో మరీ ఎస్టీ ,ఎస్సీ రిజర్వేషన్ తో పాటు 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. మొదట వికలాంగులైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు.ఆ తరువాత పురుషులను ఎంపిక చేస్తారు. అర్హులైన దివ్యాంగులు ఏ జిల్లా నుంచి అయినా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించింది ప్రభుత్వం. ఎప్పటిలానే ఏపీ ప్రభుత్వం ఈసారి కూడా వికలాంగులకు చేయూత నివ్వడం కోసం ముందుకు వచ్చింది. ఇది దివ్యాంగులకు ఒక అద్భుతమైన వరం అని కూడా చెప్పవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు ప్రజలకు ఎన్నో రకాలుగా వివిధ ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి అని కూడా చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: