గత కొద్ది నెలల నుండి వాట్సాప్ కొత్త కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వస్తున్న విషయం అయితే అందులో భాగంగానే ఇటీవల కూడా వాట్స్అప్ కొత్త కమ్యూనికేషన్ నిబంధనలను అమల్లోకి  తీసుకువస్తోంది అంటూ గత రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇకపై అన్ని కాల్స్ రికార్డు చేయడంతోపాటు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి అన్ని సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచుతారు. ప్రభుత్వానికి ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకండి. రాజకీయం , మతకల్లోలానికీ సంబంధించినటువంటి సందేహాలు పంపితే , వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారట అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక అంతే కాకుండా ఈ నిబంధన ఈ రోజు నుంచే అమలులోకి వస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే అది ఎంతవరకు నిజమో? అబద్దమో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఎప్పటిలాగే ఈసారి కూడా వాట్సాప్ కు సంబంధించి ఒక  కొత్త ఫీచర్ అమల్లోకి వచ్చింది. అదేమిటంటే "మూడు టిక్స్ పడితే" ప్రభుత్వం దృష్టికి మీ మెసేజ్ చేరినట్లు అర్థం. రెండు నీలిరంగు, ఒక ఎరుపు రంగు టిక్ పడితే ప్రభుత్వం మీ పై చర్యలు తీసుకుంటుందని అర్థం, ఒక నీలి, రెండు ఎరుపురంగు టిక్కులు పడితే ప్రభుత్వం మీ  మెసేజ్ లని పరిశీలిస్తున్నది అని  దాని అర్థం.

ఇక మూడూ రెడ్ టిక్ లు  పడితే ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా ప్రొసీడింగ్స్ ప్రారంభించిందని , త్వరలోనే నోటీసులు జారీ అవుతాయని  ఇలా విస్తృతంగా ప్రచారం అవుతోంది.

అయితే ఇందులో వాస్తవం ఏంటంటే:
ప్రస్తుతం బాగా ప్రచారం అవుతున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. మీ సందేశాలను, కాల్స్ ను ప్రభుత్వం రికార్డు చేయదు. వాట్స్అప్ కొత్తగా ఎలాంటి కమ్యూనికేషన్ నిబంధనలు అమలు చేయలేదు. 3రెడ్  లేదా బ్లూ టిక్ ఫీచర్ కూడా ఎక్కడా లేదు. వాట్సాప్ సందేశాలు ఎండ్ - టు - ఎండ్ ఎంక్రీప్షన్ కాబట్టి వాటిని చూడడానికి అసలు వీలుపడదు. కాబట్టి ఇకపై ఇలాంటి పుకార్లను నమ్మవద్దని వాట్సప్ కూడా హెచ్చరిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: