ఒక్కోసారి కొన్ని విషయాల గురించి ఆలోచిస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము అనుభవిస్తున్న ప్రతి ఒక్క వస్తువు లేదా పరికరాలు పూర్వ కాలంలో ఎవ్వరో ఒకరు కనిపెట్టినవే ? కొన్ని వస్తువులను కనుక అలాంటి మహానుభావులు కనిపెట్టకపోయి ఉంటే మన పరిస్థితి ఏమిటో ? ఉదాహరణకు మనకు వేసవి కాలంలో చాలా వేడి ఉంటుంది కదా, మీ ఇంట్లో ఎయిర్ కండీషనర్ లేకపోతే మీరు ఉండగలరా ? కనీసం దీనిని ఊహించుకోగలమా ? అదే విధంగా ఎలక్ట్రికల్ ఫ్యాన్ గురించి మీకు ఏమి తెలుసు. స్విచ్ వేస్తే తిరుగుతుంది, వేడిగా ఉన్న మనకు చల్లని గాలిని అందిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, పూర్వం వేడిగా అనిపించినప్పుడు మన శరీరాన్ని చల్లబరుచుకోవడానికి వివిధ పద్దతులను అవలంభించేవారు. ఈజిప్టు దేశస్థులు పెద్ద పెద్ద తామరాకులను, తడిగా ఉండే మ్యాట్ లను ఉపయోగించి చల్లని గాలిని సృష్టించుకుని సేదతీరేవారు.

* ఇందులో భాగంగానే క్రీస్తు శకం 180 లో టింగ్ హువాన్ పది అడుగులు ఉన్న ఏడు చక్రాలతో ఒక రోటరీని కనుగొన్నాడు. దీని సహాయంతో ఒక గదిలో ఉన్న వేడిని చల్లగా మార్చవచ్చు.

* ఆ తర్వాత 1830 సంవత్సరంలో ఒక అమెరికా డాక్టర్ హాస్పిటల్ లోని రోగులు ఉండే రూమ్ ను చల్లబరచడానికి ఒక బకెట్ లో మంచు గడ్డలను ఉంచాడు.

* ఇప్పుడు మనము మరణించిన బాడీని కుళ్ళకుండా చేయడానికి ఫ్రీజర్ లను వాడుతున్నాము. కానీ 1881 లోనే అమెరికా అధ్యక్షుడు హత్యచేయబడితే ఆయన మృతదేహం కుళ్ళకుండా ఉండడానికి ఐస్ తో నింపబడిన ఒక ఫ్యాన్ ను గదిలో ఉంచారు. దీని కోసం గంటకు 436 పౌండ్ల మంచు ఖర్చు అయింది.  

* ఈ సంఘటన తరువాత వీలర్ ఒక విద్యుత్ తో తిరిగే ఫ్యాన్ ను తయారుచేయడానికి సంకల్పించాడు. మొదటగా వీలర్ రెండు బ్లేడ్ లు మాత్రమే ఉండే విద్యుత్ ఫ్యాన్ ను కనుగొన్నాడు. అప్పట్లో ఈ ఫ్యాన్ ను క్రోకర్ & కర్టిస్ ఎలక్ట్రిక్ మోటార్ కో కొనుగోలు చేసింది.

ఫ్యాన్ లను కనుగొనే మార్గంలో వివిధ దశలలో ఒక్కొక్కరు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు.

* థియోఫిలస్ దేసాగులియర్ అనే వ్యక్తి 1731 సంవత్సరంలో గనులను వెంటిలేట్ చేయడానికి ఫ్యాడిల్ ఫ్యాన్ ను ఆవిష్కరించాడు.

* ఆ తరువాత 1882 లో షూలర్ స్కట్స్ వీలర్ 2 బ్లేడ్ లు కలిగి ఉన్న ఎలక్ట్రిక్ ఫ్యాన్‌ను తయారుచేశాడు.

* ఫిలిప్ హెచ్. డీహెల్ ఏ వ్యక్తి 1889 లో  సీలింగ్ ఫ్యాన్‌ ను కనుగొన్నారు.

* ఆ తర్వాత రెండు బ్లేడ్ లు కంటే ఎక్కువ కలిగి ఉన్న ఫ్యాన్ ను 1896 లో కనుగొనడం జరిగింది.

* విల్లీస్ కారియర్ 1902 లో ఎయిర్ కండీషనర్ ను కనుగొన్నాడు.

ఈ విధంగా ఒక ఫ్యాన్ ఫ్యాడిల్ నుండి ఎయిర్ కండీషనర్ వరకు వివిధ వ్యక్తులు ఫ్యాన్ ను అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు.





మరింత సమాచారం తెలుసుకోండి: