ప్రస్తుతం ప్రతీ దానికీ పీడీఎఫ్ ఫైల్స్ అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. మనం ఏదైనా సందేశాన్ని పంపించాలంటే pdf రూపంలో పంపిస్తేనే.. అవతల వాళ్ళకి సులభంగా ఉండడంతోపాటు శ్రమ కూడా తగ్గుతుంది.. ఎందుచేతనంటే అందులో స్పష్టంగా అన్నీ కనిపిస్తాయి. అంతేకాకుండా మనం ఎక్కడైనా సేవ్ చేసుకునే అవకాశం కూడా కలదు. ఇకపోతే మనం ఏదైనా అక్షరాల రూపంలో రాసుకున్న యెడల, దానిని పీడీఎఫ్ ఫైల్ గా ఎలా మార్చాలో తెలుసుకుందాం.

1).ముందుగా మీ దగ్గర ఉన్న కంప్యూటర్, మొబైల్ ఫోన్ లో బ్రౌజర్ ని ఓపెన్ చేసి, అక్కడ www.online2pdf.com అనే వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.

2). మీకు పైన చూపించిన విధంగా ఒక డిస్ప్లే అవుతుంది.

3). అక్కడ చూపించిన విధంగా మనం ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి వాటిని అయినా సరే pdf ఫైల్ రూపంలో మార్చుకోవచ్చు.


5). ఒకేసారి ఎన్ని ఫైల్స్ అయినా పీడీఎఫ్ కిందికి మార్చుకోవచ్చు.

6). పైన చూపించిన విధంగా connvert అనే ఆప్షన్ పై క్లిక్ చేయవలసి ఉంటుంది.

7). క్లిక్ చేసిన వెంటనే అక్కడ file ప్రాసెస్డ్ అని కనిపిస్తుంది.

8). ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత.. ఆటోమేటిక్ గా పీడీఎఫ్ ఫైల్ డౌన్ లోడ్ అయిపోతుంది.

9). అలా డౌన్లోడ్ అయిన ఫైల్స్ ని , పైన చూపించిన బాక్స్ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ సేవ్ చేసుకోవాలో కూడా మనం మార్చుకోవచ్చు.
ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఎటువంటి ఖర్చు లేకుండా ఫైల్స్ అతి త్వరగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఎటువంటి వర్డ్ ఫైల్స్ నైనా ఈజీ గా పిడిఎఫ్ ఫైల్స్ రూపంలోకి మార్చుకొని మన పనిని మరింత సులభతరం చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి