షియోమీ.. టెక్నాలజీకి అనుగుణంగా తమ సంస్థను మరింత అత్యాధునికంగా మార్చుకుంటున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీ సంస్థ. ఎప్పటికప్పుడు సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను భారత మార్కెట్లోకి విడుదల చేస్తూ, తమ కస్టమర్లకు మరింత వినోదాన్ని పంచడమే కాకుండా తమ కస్టమర్ల పనితీరును మెరుగుపరుస్తూ శ్రమను తగ్గిస్తోంది. అంతేకాదు ఎక్కువ కస్టమర్లను ఆకర్షించడానికి సరికొత్త ఫీచర్ లతో ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే ఈనెలాఖర్లో రెండు ల్యాప్టాప్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. వాటి ఫీచర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇక 14 అంగుళాల స్క్రీన్ కలిగిన  ఎమ్ఐ నోట్ బుక్  ప్రో,  అలాగే 15.6 అంగుళాల స్క్రీన్ కలిగిన ఎంఐ నోట్ బుక్ అల్ట్రా ల్యాప్టాప్. ఈ రెండింటిని జూలై నెలాఖరులో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని షియోమి సన్నాహాలు  సిద్ధం చేస్తోంది. ఇవి రెండూ ఇప్పటికే చైనాలో ప్రారంభించబడిన నోట్ బుక్ ప్రో 14 అలాగే నోట్ బుక్  ప్రో ఎక్స్ యొక్క రీ బ్రాండెడ్ మోడల్ వెర్షన్ లతో  రూపొందించి, తిరిగి భారత్ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అంతేకాదు ఈ ల్యాప్ ట్యాప్ లలో హార్డ్వేర్ అయిన ఇంటెల్ పదకొండవ జనరేషన్ టైగర్ లేక్ ప్రాసెసర్ ను  రూపొందించినట్లు సమాచారం.అయితే షియోమి ప్రవేశపెట్టిన ఈ రెండు ల్యాప్టాప్ ల  ఫీచర్ల ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Mi notebook pro 14:
 14 అంగుళాల ఎల్సిడి స్క్రీన్ తోపాటు 2,560 x 1600 పిక్సెల్ రిజల్యూషన్ తో మనకు లభిస్తోంది. ఈ స్క్రీన్ పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రూపొందించడమే కాకుండా TUV రైన్ ల్యాండ్  చేత కూడా ధృవీకరించబడింది. ఎందుకంటే ఈ స్క్రీన్ నుంచి మన కళ్లు ఎటువంటి అలసట పొందకుండా రూపొందించబడింది. ఇక ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ 16 జీబీ వరకు ఇవ్వబడింది. బ్యాటరీ 56 Wh తో 12 గంటలకు పాటు వినియోగించవచ్చు. అంతే కాదు ఇది వైఫై సిక్స్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో వేలిముద్ర సెన్సార్లు కూడా చేర్చడం మరో విశేషం. ఇక ఈ లాప్ టాప్ తో పాటు యూఎస్బి - సి , హెచ్డిఎమ్ఐ అడాప్టర్ తో పాటు ఆడియో కోసం 3.5 ఎంఎం కాంబో జాక్  కూడా ఇవ్వబడుతుంది. ఇక ప్రస్తుతం మన భారత మార్కెట్లో దీని ధర రూ. 60,000 గా నిర్ణయించబడింది.

2. Mi notebook pro x 15.6:
చైనాలో విడుదల చేసిన ఎంఐ నోట్ బుక్ అల్ట్రా 15.6 ల్యాప్టాప్ లో కొన్ని మార్పులు చేసి ఎమ్ఐ నోట్ బుక్ ప్రో ఎక్స్ గా రూపొందించారు. ఇది గేమింగ్ ల్యాప్టాప్. ఇందులో 15.6 అంగుళాల స్క్రీన్ తో 3,456 x 2,160 ఓ ఎల్ ఈ డి ఫైనల్ తో తయారు చేయబడింది. స్టోరేజ్ 16 జీబీ నుంచి 32 జీబీ వరకు పొడగించారు. ఇందులో 80 Wh బ్యాటరీ కూడా రూపొందించబడింది. ఇక భారత మార్కెట్లో దీని ధర 97, 900 రూపాయలుగా పరిగణించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: