మనం వాట్సాప్ లో ఏవైనా సింబల్స్ ను పంపిస్తూ ఉంటాము. జంతువులు, స్మైల్, ఫ్రూట్స్ వంటి వాటి పిక్చర్స్ చూసే ఉంటాము. అలాంటి ఎమోజీ లలో మరికొన్ని మన ముందుకు తీసుకువచ్చింది వాట్స్ అప్. ఇక ఇటువంటి ఎమోజీలు ఆండ్రాయిడ్, ఐఓఎస్, పిసి వంటి వాటిలో సరి కొత్తగా ఎమోజీ లను వాట్సఅప్ ప్రవేశపెట్టింది. ఇవి మెసేజ్ ను టైప్ చేసేటప్పుడు, సైడ్ ఉన్న స్మైల్ బటన్ సింబల్ తో కనిపిస్తున్న బటన్ ను క్లిక్ చేయడం వల్ల వస్తాయన్న విషయం మనకు తెలిసిందే.
ముఖ్యంగా మీరు పంపే సందేశానికి మరింత ప్రాధాన్యతను ఇవ్వడానికి వాట్సప్ ఈ సరికొత్త ఎమోజీలను ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది. ఎమోజీలు కేవలం సాధారణ సంభాషణలో మాత్రమే ఉపయోగించడం కుదురుతుందని , ఒకవేళ ఏదైనా వ్యాపారం లేదా పని సందేశాలకు జోడించడం వల్ల అనధికారమవుతుందని, అలాగే వృత్తి పరంగా అవి కనిపించవు అని కూడా వాట్స్అప్ చెప్పుకొచ్చింది.
ఒకవేళ మీరు వాట్సాప్ లో వస్తున్న కొత్త చాటింగ్ పద్ధతిని, చిత్రాలకు, సందేశాలకు ఎలా జోడించాలో తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోవచ్చు.

ఇందులో ముఖ్యంగా వాట్సప్ హోమ్ స్క్రీన్ లేదా యాప్ డ్రాయర్ నుండి వాట్సాప్ ను ప్రారంభించవచ్చు. ఇక పైన కనిపిస్తున్న చాట్స్ ట్యాబ్ కింద ఉన్న సంభాషణలలో ఏదో ఒక దానిని తెరవండి. ఇక మీరు మీ మిత్రులకు లేదా బంధువులకు సందేశాలను, స్టిక్కర్లను , ఎమోజీలను లేదా gif లను పంపించేటప్పుడు, స్క్రీన్ చివర్లో ఎడమ భాగాన వున్న స్మైలీ గుర్తుపై క్లిక్ చేయండి. ఇక్కడ అందుబాటులో వున్న ఎమోజీ లను నావిగేట్ చేయడానికి, ఎడమ లేదా కుడివైపు స్వైప్ చేస్తూ మీ సందేశానికి తగిన ఎమోజీ ని జోడించవచ్చు. ఎమోజీ ని పంపించేటప్పుడు వివిధ రంగుల్లో మీకు కనిపిస్తాయి. మీరు ఒక ఎమోజీ పై నొప్పి పట్టుకున్నప్పుడు, ఏ రంగు కావాలంటే ఆ రంగులను ఎంచుకోవచ్చు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి