**ఈ రూపి అంటే ఏమిటి**
ఈ రూపాయి అనేది వినియోగదారునికి సెల్ ఫోన్ కి క్యూఆర్ కోడ్ రూపంలో లేదా ఎస్ఎంఎస్ వోచర్ రూపంలో వస్తుంది. ఈ రూపీ ఎలాంటి ప్లాట్ ఫామ్ కాదు అని చెప్పవచ్చు. ఇందులో థర్డ్ పార్టీ యొక్క పేమెంటు ప్రమేయం ఉండదు. వోచర్లు లేదా ఈ కోడ్ ను ఉపయోగించి లబ్ధిదారులు నెట్ బ్యాంకింగ్ గాని, డిజిటల్ పేమెంట్ గాని, యాప్ లతో సంబంధం లేకుండా వారి యొక్క డబ్బును బదులుగా వినియోగించుకోవచ్చని తెలియజేసింది. ఈ రూపీలో కేంద్ర ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ సహకారం ఎంతో ఉందని చెప్పవచ్చు. దీనిలో వచ్చే స్ట్రింగ్ ఓచర్ ను, ఎస్ఎంఎస్ రూపంలో గాని వచ్చే వోచర్ ను వ్యాపార సంస్థల దగ్గర రీడిం చేసుకునే సదుపాయం ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన మందులు, టీవీ కార్యక్రమంలో, మందులు, ఎరువుల కొనుగోలు మాతా శిశు సంరక్షణ వంటి వాటికి సంబంధించి నగదు బదిలీ రూపంలో మనకు సబ్సిడీ కూడా లభిస్తుంది. వీటిని తొలిదశలోనే ఈ యొక్క ఈ రూపిని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలు కూడా ఉద్యోగుల సంరక్షణకు ఈ రూపి ఓచర్ లను జారీ చేయవచ్చని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా వ్యాక్సిన్ కు సంబంధించి తమ ఉద్యోగస్తులకు ఈ రూపిని గిఫ్ట్ గా ఇవ్వవచ్చని తెలియజేసింది. ఇప్పటికే ఐ సి ఐ సి ఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సెస్, ఎస్బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా వంటి బ్యాంకులతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి