ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకి బాగా పెరిగిపోతోందని చెప్పాలి. ఈ క్రమంలో చాలా ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇండియా మార్కెట్లో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇక ఇందులో భాగంగానే ఇండియా మార్కెట్లో భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ సింపుల్ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడం జరిగింది.ఇండియా మార్కెట్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైనప్పటి నుంచి బుకింగ్స్ కూడా బాగానే ప్రారంభయ్యాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు 1947 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రారంభంలోనే తెలిపడం జరిగింది. ఇక ఇప్పుడు కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ తన ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొత్త సమాచారాన్ని విడుదల చేయడం జరిగింది.

సింపుల్ ఎనర్జీ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 30,000 యూనిట్లకు పైగా బుకింగ్ లను స్వీకరించినట్లు తెలిపడం జరిగింది. సింపుల్ ఎనర్జీ ఇంకా సింపుల్ వన్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్ లో తెచ్చిన తర్వాత కస్టమర్ల నుండి ఇంత గొప్ప ఫీడ్‌బ్యాక్ అందుకోవడం అనేది చాలా అద్భుతం.సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలాంటి మార్కెటింగ్ లేకుండా ఇంత భారీ బుకింగ్‌లను స్వీకరించిందని కంపెనీ స్పష్టం చేయడం జరిగింది. ఇక దీని గురించి మాట్లాడుతూ, సింపుల్ ఎనర్జీ సిఈఓ  సుహాస్ రాజకుమార్ అధికారికంగా సమాచారం అందించడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రారంభించినప్పటి నుంచి కూడా అద్భుతమైన స్పందనను పొందడం జరిగింది.సింపుల్ ఎనర్జీ కంపెనీ త్వరలో ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.ఇండియా మార్కెట్లో విడుదలైన కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్లలో రానుంది. ఇందులో నమ్మ రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్ ఇంకా బ్రెజెన్ బ్లాక్ కలర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: