తాజా గా గూగుల్ ఇలాంటి ప్రమాదకర మైనా యాప్స్ ను మరో సారి గుర్తించింది. అంతే కాకుండా తన ప్లే స్టోర్ నుంచి 100 పైగా ప్రమాద కరమైన యాప్స్ ను తొలగించింది. అంతే కాకుండా మొబైల్ యూజర్స్ ఈ యాప్స్ ను వెంటనే డిలిట్ చేయాలని కూడా హెచ్చరించింది. తాజాగా గూగుల్ నిషేధించిన యాప్స్ లలో ట్రూ కాలర్ అండ్ ట్రూ రికార్డర్, ఫోటో ల్యాబ్, లూడో గేమ్ క్లాసిక్, హ్యాండి ట్రాన్స్ లేటర్ ప్రో, హర్ట్ రేట్ అండ్ పల్స్ ట్రాకర్, జియోస్పాట్ జీపీఎస్ లోకేషన్ ట్రాకర్, ఫింగర్ ప్రింట్ ప్రొ, కీబోర్డ్ థీమ్స్, వాట్స్ మీ స్టిక్కర్, సేఫ్ లాక్, హార్ట్ రిథమ్, కట్ కట్ ప్రొ, ఫింగర్ ప్రింట్ డిఫెండర్, ఐకానీ, హరోస్కోప్ ఫార్చూన్, క్లాప్, ఫోటో ఎఫెక్ట్ ప్రో, ఫేస్ ఎనలైజర్, ఫిట్ నెస్ ట్రైలర్ వంటి యాప్స్ తో పాటు మొత్తంగా 100 పైగా యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇలాంటి యాప్స్ మీ మొబైల్స్ లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి