చైనా దేశానికి చెందినటువంటి ప్రముఖ బ్రాండెడ్ సంస్థ వివో .ఇక తాజాగా సరికొత్త ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. సరికొత్త ప్రాసెస్ తో స్నాప్ డ్రాగన్..680 చిప్ సెట్ అప్ తో సరికొత్తగా y-32 వివో మోడల్ మొబైల్ ను మార్కెట్ లో విడుదల చేసింది. ఇక ఇది 5-జీ తో కూడా పనిచేసే విధంగా తయారు చేయబడినదట. ఇక ఈ మొబైల్ సరికొత్త టెక్నాలజీతో పాటు లేటెస్ట్ ప్రాసెస్ ఉండటం కూడా ఒక విశేషం. ఈ మొబైల్ ప్రస్తుతం చైనాలోనే అందుబాటులో ఉన్నది. అక్కడ ధర ప్రకారం1,399 చైనీస్ యువాన్లు కాగా.. మన ఇండియన్స్ కరెన్సీ ప్రకారం 16,700 రూపాయలు అన్నమాట. ఇక వేరియంట్ విశేషాలు బట్టి ధర మారుతూ ఉంటుంది.

ఇండియాలో మాత్రం ఈ మొబైల్ విడుదల అవుతుందో లేదో అన్న విషయం ఇంకా తెలియడం లేదు. కానీ ఇదే ధర కి రెడ్ నోట్-10 ప్రో ను విడుదల చేసింది ఆ బ్రాండెడ్ సంస్థ. ఒకవేళ vivo y-32 మొబైల్ మన ఇండియాలో విడుదలైనట్లు అయితే.. గట్టిపోటీ ఇస్తుందనే నమ్మకం ఆ సంస్థకు ఉన్నది. ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ వివరాల్లోకి వస్తే..

ఇక ఇది డిస్ప్లే..6.51 అంగుళాలు కలదట.8 GB+128 GB మెమొరీ కార్డ్ సామర్థ్యం కలదు. ఇక ఇందులో కెమెరా విషయానికి వస్తే..13 మెగాఫిక్సల్ కెమెరాను ప్రైమరీ గా సెట్ చేశారు. ఇక ఫ్రంట్ 8  మెగాఫిక్సల్ కెమెరాను కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యం కలదు.18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు. కేవలం ఒకసారి ఛార్జింగ్ చేసినట్లయితే..27 గంటల పాటు వస్తుందట. ఇది కూడా ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేస్తుంది. రియల్ నర్సింగ్ కాటన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్, యు ఎస్ బీ, వంటి సదుపాయాలు కూడా కలదు.మొత్తానికి తక్కువ ధర మొబైల్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: