స్మార్ట్ మొబైల్ మనుషుల దిన జీవితంలో ఒక భాగమైపోయింది.. ఎంతలా అంటే.. మొబైల్ అవసరం ఉన్నా లేకున్నా దానిని మన వెంటే తీసుకుంటూ వెళుతూ ఉంటాము.. నిద్రలేచింది మొదలు.. నిదురించే వరకు మొబైల్ ని చూస్తూనే ఉంటాము. ఇక మొబైల్స్ ను మనం అవసరం కంటే అనవసరంగా నే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము.. ముఖ్యంగా మొబైల్స్ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని కొంతమంది నిపుణులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొబైల్ వినియోగించేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కొంతమంది నిపుణులు తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ ని ఎప్పుడు లాక్ చేయడం మంచిది.. పిన్ లేదా పాస్వర్డ్ వంటివి పెట్టుకోవడం చాలా ముఖ్యమట.. ఎందుచేత అంటే ఎవరైనా మొబైల్స్ ని దొంగిలించిన వారికి ఇది సమస్యగా మారుతుంది.

సెక్స్ వల్ నేచర్ కు సంబంధించిన వీడియోలను ఫోటోలను తీయడం చాలా నేరము.. అంతేకాకుండా ఏ వ్యక్తికైనా నగ్నంగా లేదా అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను పంపితే అవి చట్ట రీత్యా నేరంగా పరిగణిస్తారు.

మొబైల్ కలిగి ఉండేది స్వతంత్రపు హక్కు అయినా కూడా .. కొంతమంది వీటిలో పోర్న్ వీడియోలు చూస్తూ.. చిన్న పిల్లల పై అఘాయిత్యాలు కు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటివి చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులు అప్పుడప్పుడు తమ పిల్లల మొబైల్స్ ను చెక్ చేయడం మంచిది.

మీరు అసభ్యరకరమైన ఫోటోలను , వీడియోలను మీకు సంబంధించిన వారికి షేర్ చేయకపోవడం మంచిది.

మీ మొబైల్ లో ఎటువంటి సందేశాలు, ఫోటోలు, వీడియోలు డిలీట్ చేసినప్పటికీ అవి ఎక్కడో ఒక చోట సేవ్ చేయబడి ఉంటాయట.

ముఖ్యంగా డ్రైవింగ్ లో మెసేజ్ వంటివి చేయకూడదు.. అలా చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరగవచ్చు అందుచేతనే ఏదైనా ప్రదేశం వద్ద ఆపి మీరు ఆ పనిని పూర్తి చేయాలి.

మొబైల్లో చట్టానికి సంబంధించి.. ఉల్లంఘించే పనులను చేయకూడదు.. స్కూల్ కి వెళ్ళే పిల్లలకు మొబైల్ ఇవ్వడం చాలా నేరము.

మరింత సమాచారం తెలుసుకోండి: