బిఎస్ఎన్ఎల్ రూ.49 ప్లాన్ :
ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు ఏకంగా 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే 100 నిమిషాల పాటు వాయిస్ కాలింగ్ , 24 రోజుల పాటు ప్లాన్ వాలిడిటీ ఉండటం గమనార్హం. అత్యవసర పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ చాలా చక్కటి ఆఫర్ అని చెప్పవచ్చు.
బిఎస్ఎన్ఎల్ రూ.94 ప్లాన్ :
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ గడువును 45 రోజులు ఉంటుంది . మొత్తం మూడు జీబీ డేటా లభించడంతోపాటు 100 నిమిషాల వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని కూడా అందించడానికి సిద్ధం అయ్యింది బిఎస్ఎన్ఎల్.
బిఎస్ఎన్ఎల్ రూ.98 ప్లాన్ :
ఇకపోతే ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు మొత్తం ప్రతిరోజు 3 జిబి డేటా లభిస్తుంది. అంటే ఇరవై రెండు రోజులపాటు వ్యాలిడిటీ లభించే ఈ ప్లాన్ తో ఏకంగా 48 జిబి డేటా ను ఉచితంగా పొందవచ్చు ముగిసిన తర్వాత కూడా మీరు 40 kbps స్పీడ్ తో డేటా ను ఉపయోగించుకోవచ్చు.
ఇక బిఎస్ఎన్ అందిస్తున్న ఈ ప్లాన్ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. 22 రోజుల పాటు నిరంతరాయంగా కాల్ మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించబడింది.
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ నాలుగు ఆఫర్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఉండడం గమనార్హం దీంతో కస్టమర్లు సైతం హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది.