వాట్సప్ యూజర్లకు ఎప్పటికప్పుడు ఎన్నో ఫీచర్లను అందిస్తోంది వాట్సప్. మరో ఫీచర్ ను తాజాగా యాడ్ చేసింది దీని సహాయంతో మనం పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాలను సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చట. ఎలక్ట్రానిక్ , ఐటీ మంత్రిత్వ శాఖ ఈ విషయంతో ప్రజలకు ఒక గొప్ప ఉపశమనం కలిగించింది. డిజి లాకర్ సేవలను ఉపయోగించడానికి ప్రజలు ప్రస్తుతం వాట్సాప్ లోని MYGOV హెల్ప్ డెస్క్ ను యాక్సెస్ చేసుకోవలసి ఉంటుంది.


మన పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర ముఖ్యమైన పత్రాలను సాఫ్ట్ కాపీలను ఎప్పటికప్పుడు మనతో ఉంచేలా ఈ యాప్ ని తీసుకువచ్చారు. ఇక ఎక్కడైనా సరే మనం ఈ డిజిలాకర్ ను డౌన్లోడ్ చేసుకొని అవసరమైన పత్రాలను చూపించవచ్చు. ఈ లాకర్ ను ఉపయోగించే పద్ధతి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1) ముందుగా ఈ డిజి లాకర్ ను మనం ఉపయోగించుకోవాలంటే మన మొబైల్ లో +919013151515 నెంబర్ ను సేవ్ చేసుకోవాలి. నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత వాట్సప్ యాప్ ను ఓపెన్ చేసుకోవాలి.

2). వాట్సాప్ తెరిచిన తర్వాత ఈ నెంబర్ తో చాట్ బాక్స్ ను ఓపెన్ చేసి.. నమస్తే లేదా హాయ్ డిజిలాకర్ అని టైప్ చేసి మెసేజ్ ను పంపాలి.

3). దీని ద్వారా మనం COWIN సర్వీస్, డిజి లాకర్ సర్వీస్ అనే రెండు ఎంపికలను ఉపయోగించుకోవచ్చు.

4). మన డిజి లాకర్ సేవలు ఎంచుకున్న వెంటనే ఆధార్ ధ్రువీకరణ పత్రం కోరుతుంది ఆ వెంటనే మనకు ఓటిపి కూడా వస్తుంది


5). ధ్రువీకరణ తరువాత  మీ డిజి లాకర్ లో ఏ పత్రాలు ఉన్నాయి అవి మనకు తెలియజేస్తాయి.

6). ఆ తరువాత ఆ డాక్యుమెంట్ తో ఏ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయాలనుకుంటున్నారు వాటిని ఒకసారి చెక్ చేసుకుని నమోదు చేయాలి.

7). ఓటిపి ధృవీకరించిన తర్వాత మీ పత్రాలను సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు..

ఇప్పటివరకు ఈ యాప్ నుంచి 80 మిలియన్ల మంది ఉపయోగించరట.

మరింత సమాచారం తెలుసుకోండి: