ఇక ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్ల సేల్ మళ్లీ లైవ్ అయింది. అంటే సెకండ్ హ్యాండ్ ఫోన్లు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఈ కేటగిరీలో ఐఫోన్లు ఇంకా అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఉన్నాయి.ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 6, 6ఎస్, 6 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 7 ఇంకా అలాగే ఐఫోన్ 8 స్మార్ట్ ఫోన్లను బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.దీంతోపాటు రెడ్‌మీ, మోటొరోలా శాంసంగ్ ఇంకా గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు కూడా ఈ కేటగిరిలో ఉన్నాయి. ఇక ఫ్లిప్‌కార్ట్ రీఫర్బిష్డ్ కేటగిరిలో ఉండే ఫోన్లను చాలా బాగా చెక్ చేస్తుంది.అలాగే క్వాలిటీ చెకింగ్ ప్రాసెస్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. మొత్తంగా 47 రకాల క్వాలిటీ చెక్స్‌లో పాస్ అయిన ఫోన్లు మాత్రమే ఈ సేల్‌లో ఉంటాయి. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఫోన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక యాపిల్ ఐఫోన్ 6ఎస్ ధర వచ్చేసి రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ 16 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఇందులో 4.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే అనేది ఉంటుంది. అలాగే ఇందులో టచ్ ఐడీని అందించారు. ఈ ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ ఇంకా ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఏ9 చిప్‌సెట్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.



అలాగే ఇందులో 64 జీబీ మోడల్ వేరియంట్ ధర రూ.10,899గా ఉంది. సిల్వర్, స్పేస్ గ్రే ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.అలాగే యాపిల్ ఐఫోన్ 7  ధర రూ.14,529గా ఉంది. దీని ఫీచర్లన్నీ ఐఫోన్ 8 తరహాలోనే ఉంటాయి. కానీ ఏ10 ప్రాసెసర్‌ను దీనికి అందించారు.గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ ధర వచ్చేసి రూ.13,999గా ఉంది. ఈ ఫోన్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఈ ఫోన్లో 6.3 అంగుళాల క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.అలాగే 12.2 మెగాపిక్సెల్ కెమెరాను ఫోన్ వెనకవైపు అందించారు. అలాగే ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్లు అనేవి ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది.గూగుల్ పిక్సెల్ 3ఏ ఫోన్ ధర వచ్చేసి రూ.10,789గా ఉంది. ఇది కూడా 64 జీబీ మోడలే. ఈ ఫోన్లో 5.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే వెనకవైపు 12.2 మెగాపిక్సెల్ కెమెరా ఇంకా ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి 3000 ఎంఏహెచ్‌గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: