ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ప్రజలలో దాదాపుగా పదిమందిలో కనీసం 8 మందికి పైగా ఎక్కువగా స్మార్ట్ మొబైల్స్ ఉపయోగించుకునేవారు ఉన్నారు. అయితే వారిలో దాదాపుగా ఒక ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే స్మార్ట్ మొబైల్ గురించి పూర్తి అవగాహన తెలిసినవారు ఉంటారని చెప్పవచ్చు. స్మార్ట్ మొబైల్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కొన్ని ఫిచర్లు తెలియకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే మొబైల్స్ ను వాడితే మరి కొంతమంది వారి యొక్క పనులను చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.


అయితే ఎప్పుడైనా స్మార్ట్ మొబైల్ వెనుక వైపు కెమెరాల మధ్యలో అలాగే ఫ్లాష్ లైట్ దగ్గర ముందు బాగాన లేదా పక్కన చిన్నపాటి రంద్రం ఉండడం గమనించవచ్చు. మరి ఆ రంద్రం ఎందుకు ఉన్నదో ఎక్కువమందికి తెలియదు.. మరి ఆ రంధ్రం వల్ల ఉపయోగాలు కూడా చాలానే ఉన్నాయి అన్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు వాటికి సంబంధించి వివరాలను మనం తెలుసుకుందాం.


స్మార్ట్ మొబైల్స్ మార్కెట్లో విడుదలైన కొత్త మొబైల్స్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక రకమైన శబ్దాలు వినిపిస్తుందని అందువల్ల అవతలి వ్యక్తి మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపించడం లేదని ఎంతోమంది తెలియజేస్తూ ఉంటారు. అదే నాయిస్ డిస్ట్రబెన్స్ .. అయితే మొదట వచ్చిన మొబైల్స్ కు అలాంటి సమస్య రాలేదు మళ్లీ.. ఇప్పుడు వస్తున్న సరికొత్త మొబైల్స్ కు ఇలాంటి సమస్య ఎక్కువగా ఉందని పలువురు యూజర్స్ తెలియజేస్తున్నారు అందుకు కారణం ఆ రంద్రం దగ్గర చెయ్యి ఉంచడం కానీ రంద్రం డస్ట్ తో బూడిపోవడం వంటివి జరగడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయట. ఇక ఆంద్రం దగ్గర మినీ మైక్రోఫోన్ అనేది ఉంటుంది ఇది నాయిస్ క్యాన్సిలేషన్ డివైస్ గా పని చేస్తుంది. దీనివల్ల ఫోన్ చేసినప్పుడు మనకు ఎలాంటి అంతరాయం లేకుండా అవతలి వారి మాటలు స్పష్టంగా వినిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: