ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాలతో పాటు మనం ఉపయోగించే మొబైల్ కూడా తడిసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఇదే కనుక జరిగితే మీ మొబైల్ ను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొబైల్ కొన్నిసార్లు వాటర్ రెసిస్టెంట్ మొబైల్స్ చాలా తక్కువగా ఉంటాయి కొంచెం నీళ్లు చేరిన మొత్తం మొబైల్ అంతా డామేజ్ అవుతూ ఉంటుంది అయితే వర్షంలో తడిచిన మొబైల్ ఎలా పడితే అలా ఆరబెడితే మొబైల్ డెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


తడిచిన మొబైల్ ను కొందరు హెయిర్ డ్రైయర్ తో ఆరబెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం ఎందుకంటే డ్రైయర్  నుండి వెలువడే గాలి చాలా వేడి గాలి వల్ల మొబైల్ లో ఉన్న సున్నితమైన భాగాలు చాలా దెబ్బతిని అవకాశం ఉంటుంది. మొబైల్ ఏదైనా నీటిలో తడిచినప్పుడు మొబైల్ వర్క్ అవుతూ ఉంటుంది.. అలాంటి సమయాలలో ఎవరైనా చార్జింగ్ పెడితే అది చాలా ప్రమాదానికి చిక్కుతుంది. ముఖ్యంగా మొబైల్ తేలడం లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుచేతనే తడిచిన మొబైల్ ని ఎలా ఆర పెట్టాలో ఇప్పుడు చూద్దాం.


1).మొబైల్ తడిచినా లేదా వర్షంలో తడిచిన మొబైల్ని వెంటనే ఆన్ చేయకూడదు.

2). ఆ వెంటనే మొబైల్ ఛార్జింగ్ చేయకూడదు.

3). మొబైల్ ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్ కూడా ఉపయోగించకూడదు.

4). ముఖ్యంగా మొబైల్లో నుంచి సిమ్ ను తొలగించడం చాలా మంచిది.


5). అలా తడిచిన మొబైల్ ను రాత్రంతా బియ్యంలో పెట్టడం బియ్యం లో పెట్టడం వల్ల నీటిని పీల్చే గుణం అందులో ఉంటుంది.

6). బియ్యం లేకపోతే సిలికాన్ జెల్ ప్యాకెట్ మధ్య ఉంచాలి.

7). ఫోన్ ఆరిపోయిన తర్వాత వెంటనే సర్వీస్ సెంటర్ కు వెళ్లి సర్వీస్ చేయించాలి.


ఇలా చేయడం వల్ల మన మొబైల్ సురక్షితంగా ఉంటుంది.. లేదంటే వాటర్ ప్రూఫ్ మొబైల్ కవర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: