ప్రస్తుత కాలంలో మన జీవితం ఫోన్ నెంబర్ తో ముడిపడి ఉంది.ఆన్‌లైన్‌లో టికెట్ బుక్‌ చేసుకోవాలనుకున్నా, ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలన్నా వ్యక్తిగత ఫోన్‌ నెంబర్లను ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.అయితే ఇక ఈ క్రమంలో మన ఫోన్‌ నెంబర్లను కొందరు మిస్‌ యూజ్‌ చేస్తూ స్పామ్‌ కాల్స్‌కి ఉపయోగిస్తుంటారు. స్పామ్‌ కాల్స్‌లో ముఖ్యంగా టెలీమార్కెటింగ్‌ కాల్స్‌, రోబో కాల్స్‌, స్పామ్‌ కాల్స్‌ అని మూడు రకాలు ఉంటాయి.స్పామ్‌ కాల్స్‌లో ఎక్కువ కాల్స్ వినియోగదారులను మోసం చేసేవే ఉంటాయి. కాల్స్‌ చేస్తూ యూజర్లను తప్పు దారి పట్టిస్తుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత లోన్స్‌ ఇప్పిస్తాము, జాబ్‌ ఆఫర్స్‌ ఉన్నాయి అంటూ రకరకాలుగా ప్రజలను మభ్యపరుస్తుంటారు. అయితే ఇలాంటి కాల్స్‌ రాకుండా ఉండడానికి ఆండ్రాయిడ్‌ ఓ సెక్యూరిటీ ఫీచర్‌ను అందించింది. ఇందులో భాగంగా కాలర్‌ ఐడీ, స్పామ్‌ ప్రొటెక్షన్‌ అనే రెండు ఫీచర్లను గూగుల్‌ అందిస్తోంది. వీటి ద్వారా యూజర్లు స్పామ్‌ కాల్స్‌ నుంచి బయటపడొచ్చు.


ఇందుకు ఫస్ట్ మీరు ఫోన్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. ఆ తరువాత కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. అందులో కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ ప్రొటెక్షన్ అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకొని, దాన్ని ఎనేబుల్ నొక్కాలి. ఆ తరువాత అగ్రీ బటన్‌పై క్లి్‌క్‌ చేస్తే కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌ ప్రొటెక్షన్ ఫోన్‌లో యాక్టివేట్ అవుతుంది. ఇక మరో ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకోవడానికి.. ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి కింద ఉన్న రీసెంట్స్‌ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు వచ్చిన స్పామ్‌ కాల్‌ నంబర్‌పై క్లిక్ చేసి ఫోన్‌, మెసేజ్‌, వీడియో, ఐ అని ఐకాన్స్‌ కనిపిస్తాయి. వాటిలో ఐ ఐకాన్‌పై క్లిక్ చేస్తే బ్లాక్‌, రిపోర్ట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. స్పామ్‌ కాల్‌ వచ్చిన నంబర్‌ను బ్లాక్ చేయాలంటే బ్లాక్‌ ఆప్షన్‌పై, సదరు నంబరుపై రిపోర్ట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, దాని నుంచి మీకు మరోసారి ఫోన్‌కాల్స్‌ అనేవి రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: