ఇండియాలో టాప్  ఆటోమొబైల్   కంపెనీగా దూసుకుపోతున్న 'మారుతి సుజుకి'  ఇండియన్  మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లేదా అప్డేటెడ్ కార్లను విడుదల చేస్తూనే ఉంది.ఇందులో భాగంగానే కంపెనీ  'మారుతి సుజుకి బాలెనొ'  CNG వెర్షన్  ని విడుదల చేసింది. కొత్త బాలెనో cng అదే 1.2 లీటర్, ఫోర్ సిలిండర్, కె12ఎన్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే ఇది cng స్పెక్‌లో 77.5 హెచ్‌పి పవర్ మరియు 98.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా పెట్రోల్ వెర్షన్ 90 హెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇందులో ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదు.కొత్త బాలెనొ cng ప్రారంభ ధర రూ. 8.28 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 9.21 లక్షల వరకు ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి బాలెనొ cng వేరియంట్   బూట్ లో 55 లీటర్ల cng ట్యాంక్‌ ఉంటుంది. కావున దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా తక్కువ బూట్ స్పేస్ పొందుతుంది.


కొత్త బాలెనో cng వేరియంట్ 30.61 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.మారుతి బాలెనొ cng డెల్టా ఇంకా జీటా అనే రెండు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది.మారుతి బాలెనోCNG కిట్‌ను మిడ్-స్పెక్ డెల్టా ఇంకా జీటా ట్రిమ్‌లలో మాత్రమే అందిస్తోంది. అయితే టయోటా టాప్-స్పెక్ v ట్రిమ్‌తో సహా మూడు ట్రిమ్‌లలో గ్లాంజా cng ని అందించాలని భావిస్తున్నారు. కావున టాప్-ఎండ్ బాలెనో cng కంటే టొయోట గ్లాంజా cng లో ఎక్కువ ఫీచర్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో గ్లాంజా cng కూడా విడుదలవుతుందని స్పష్టంగా తెలుస్తోంది.ధర విషయానికి వస్తే..మారుతి సుజుకి బాలెనొ cng పెట్రోల్ వేరియంట్ ధరలు రూ 7.33 లక్షలు (డెల్టా) ఇంకా రూ. 8.26 లక్షలు (జీటా). దీన్ని బట్టి చూస్తే సుజుకి బాలెనొ cng పెట్రోల డెల్టా ధర, దాని 'CNG డెల్టా' వేరియంట్ కంటే రూ. 95,000 ఇంకా 'పెట్రోల్ జీటా' వేరియంట్ దాని 'జీటా CNG' వేరియంట్ కంటే రూ. 95,000 తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. అంటే పెట్రోల్ వేరియంట్ కంటే బాలెనొ cng ధరలు రూ. 95,000 ఎక్కువ అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: