ఇక ఆధార్ కార్డుని అప్డేట్ చెయ్యడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లడం, ఆ తరువాత దాని అప్లికేషన్ పూర్తి చేసి అప్ డేట్ చేస్తూ ఉంటాం. ఇలా ఉన్న పనులన్నీ మానుకుని ఈ పని చేయించుకున్నా కూడా మిగిలిన డాక్యుమెంట్స్ అప్ డేట్ చేయించుకోవడానికి చాలా ఇబ్బందిపడతాం. అయితే ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధార్ ద్వారా కీలకమైన ప్రభుత్వ పత్రాలను స్వయంచాలకంగా అప్డేట్ చేసే వ్యవస్థను పర్యవేక్షించే పనిలో ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.అయితే ఈ ఫీచర్ డెవలప్ కాన్సెప్టులైజేషన్ ప్రాథమిక దశలో ఉంది.తుది వ్యవస్థను ప్రవేశపెట్టడానికి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇక ఆధార్ కార్డుకు అప్‌డేట్ చేసినప్పుడల్లా ఆటో-అప్‌డేట్‌ ద్వారా కీలక పత్రాలపై అంటే డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇంకా అలాగే రేషన్ కార్డ్‌లుచ ఓటర్ ఐడీ కార్డ్‌లు వంటివి ఆటోమెటిక్‌గా ఈజీగా అప్ డేట్ అవుతాయి.ఇక డిజిలాకర్‌లో కీలకమైన ప్రభుత్వ పత్రాలను స్టోర్ చేసే వినియోగదారులకు ఈ సిస్టమ్ ప్రాథమికంగా చాలా బాగా సహాయపడుతుంది.


ఎన్నో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు చేసే కేవైసీ ప్రక్రియల సమయంలో ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ఇక ఆధార్ కార్డ్‌లో చేసిన మార్పులు (ఇప్పటికి ఇంటి చిరునామా వంటి జనాభా మార్పులు) డిజిలాకర్‌లోని ఇతర పత్రాల్లో కూడా ఈజీగా అప్ డేట్ అవుతాయి. ఇంకా అలాగే డిజిలాకర్ అకౌంట్‌లో మనం ఆటో-అప్‌డేట్ సేవను కూడా ఎంచుకోవాలనుకుంటున్నామో? లేదో? ఎంచుకోవచ్చు. ప్రస్తుతం రవాణా, గ్రామీణాభివృద్ధి ఇంకా అలాగే పంచాయతీ రాజ్ వంటి పరిమిత మంత్రిత్వ శాఖలో ఈ అవకాశం అందుబాటులో ఉండనుంది. ఫ్యూచర్ లో పాస్‌పోర్ట్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేసే ఛాన్స్ కూడా కల్పించవచ్చు. మంత్రిత్వ శాఖ ఆటో-అప్‌డేట్ ఫ్రేమ్ కోసం సాఫ్ట్‌వేర్ ఏపీఐలను డెవలప్ చేస్తుంది.ఇక డిజిలాకర్ పత్రాలను ఆధార్ ద్వారా అప్‌డేట్ చేయడానికి ఆటో-అప్‌డేట్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైంది. ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ల సమయం ఇంకా అలాగే ఖర్చులను కూడా ఆదా చేస్తుంది. అలాగే నకిలీ పత్రాల ముప్పు కూడా తొలగుతుంది. ఉద్యోగాల కారణంగా తరచుగా తరలివెళ్లే పౌరులకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: