ఐఫోన్ మొబైల్ కొనాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అయితే ఈ మొబైల్ కొనడం చాలా ఖరీదు అని కొంతమంది వీటిని మెయింటైన్ చేయలేము అని కొనడానికి ఎక్కువ మక్కువ చూపరు. కానీ మరి కొంతమంది మాత్రం ఈ బ్రాండెడ్ నుంచి విడుదలైన ప్రతి బ్రాండ్ ను కూడా కొనాలని చూస్తూ ఉంటారు.అలాంటి వారి కోసం త్వరలోనే ఐఫోన్-15 మొబైల్ రాబోతోంది ఈ మొబైల్ అద్భుతమైన ఫీచర్స్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అన్నిటినీ కూడా సాల్వ్ చేస్తూ పలు రకాల అప్డేట్లను సహిత ప్రకటిస్తూనే ఉంది యాపిల్ సంస్థ.


ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఫోన్లు బ్యాటరీ లైఫ్ చాలా తక్కువగానే ఉంటుంది అయితే ఇలాంటి విషయాన్ని పరిగణంలోకి తీసుకున్న యాపిల్ సంస్థ ఈ ఏడాది చివరిలోకల్లా ఐఫోన్-15 మొబైల్ మోడల్ ని అప్డేట్ చేయబడిన బ్యాటరీని పెట్టే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఐఫోన్ ప్లస్ లో 4,912 mah సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుందట అలాగే కెమెరా విషయంలో కూడా పలుమార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది గత ఏడాది విడుదల చేసిన ఐఫోన్ 14 మొబైల్ మోడల్స్ కి 12 మెగా పిక్సెల్ కెమెరాని తీసుకురావడం జరిగింది.


అయితే ఈసారి మాత్రం రాబోయే అన్ని మొబైల్స్ కు కూడా 48 ఎంపీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 250జిబి నుంచి వన్ tb వరకు స్టోరేజ్ కలిగే ఆప్షన్ కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక డిస్ప్లే విషయంలో మాత్రం 6.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుందట. ఇక ఐఫోన్-15 లో ఇవే కాకుండా పలు రకాల స్పెషల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐఫోన్-15  పూర్తి  వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఉండాల్సిందే సెప్టెంబర్ 15 నాటికి ఐఫోన్ మొబైల్ మార్కెట్లోకి రాబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: