ఇటీవల కాలంలో ఎంతోమంది విద్యార్థులు తమలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించి సరికొత్త టెక్నాలజీతో వినూత్నమైన ఆవిష్కరణలకు స్వీకరించూడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి వినూత్నమైన ఆవిష్కరణలే మనిషి చేసే ప్రతి పనిని కూడా సులభతరం చేస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటిది కొత్తగా ఏదైనా కనిపెట్టారు అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఏకంగా ఇద్దరు విద్యార్థులు ఎంతో కష్టపడి అంబులెన్స్  రహదారిపై ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు.


 ఇటీవల కాలంలో నగరాలలో ట్రాఫిక్ జామ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు కూడా సొంతంగా వాహనాన్ని కొనుగోలు చేసి రోడ్లపై వస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఇక అత్యవసర సమయంలో అంబులెన్స్ ఈ ట్రాఫిక్ నుంచి బయటపడాలి అంటే చాలా సమయం పడుతుంది అని చెప్పాలి. దీంతో కొన్ని కొన్ని సార్లు ఎంతో మంది పేషెంట్లు చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితేఇలాంటివి ఇకనుంచి పునరావృతం కాకుండా ఉండేందుకు ఇద్దరు విద్యార్థులు వినూత్నమైన ఆలోచన చేశారు. బెంగళూరులోని ఓ స్కూల్ విద్యార్థులు ఆదిత్య చేతన్, నిహార్ గౌడ అనే విద్యార్థులు అంబులెన్స్ ట్రాఫిక్ నుండి బయటపడేందుకు ఒక వినూత్నమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రతి అంబులెన్స్ లో ఒక స్విచ్ ను ఏర్పాటు చేయాలని..  ఇక ఆ అంబులెన్స్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి రాగానే ఏకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా డ్రైవర్ కు అనుమతి ఉండేలా ఇక వినూత్నమైన ఆలోచన చేశారు. ఇక తద్వారా ఇక ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడి అంబులెన్స్ ఇరుక్కుపోయిన వెంటనే.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా అంబులెన్స్ ఆ ట్రాఫిక్ నుంచి బయటపడి సకాలంలో ఆసుపత్రికి వెళ్లడం ద్వారా ఎంతో మంది నిలబెట్టే అవకాశం ఉంది అని చెప్పారు ఈ ఇద్దరు విద్యార్థులు.

మరింత సమాచారం తెలుసుకోండి: