ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఎక్కువగా వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్లలో వాట్సాప్ కూడా ఒకటి. మెటా యాజమాన్యంలో ఈ యాప్ పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తమ యూజర్స్ కి సరికొత్త అనుభూతిని అందిస్తోంది వాట్సాప్.. చాలా మంది వాట్సాప్ తోనే మెసేజ్ కాల్స్ వీడియో కాల్స్ స్టేటస్ ఇతరత్రా వంటి ఫీచర్లను సైతం అందిస్తున్నాయి. అయితే వినియోగదారులకు అంతగా పరిచయం లేని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు పలు విషయాలను తెలుసుకుందాం.


1). ముందుగా వాట్సాప్ లో మనం గతంలోనుంచే ఉచిత వీడియో కాల్స్ చేసుకునేందుకు అనుమతి ఉన్నది.. స్మార్ట్ మొబైల్స్ లేదా కంప్యూటర్ వంటి వాటిలో స్క్రీన్ షేర్ చేసుకొని సామర్థ్యాన్ని తీసుకురావడం జరిగింది. వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల మనం చేసేటువంటి పనులు అవతలి వ్యక్తికి తెలుస్తాయి. కేవలం స్క్రీన్ షేర్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.


2). వాట్సాప్ వినియోగదారులు టెక్స్ట్ ఆధారంగా స్టిక్కర్ ఆధారంగా ,ఎమోజి ఆధారంగా ఇతరత్రా వాటి ద్వారా పంపిస్తూ ఉంటారు. అయితే వీడియో ఆధారిత సందేశాలను పంపించడానికి ఉన్నదట.. అయితే ఇది ఎలా చేయాలంటే వాట్సప్ లో దిగువన ఉన్న కుడిమూలలో ఉన్న మైక్రోఫోన్ చిహ్నం పైన క్లిక్ చేస్తే అది వీడియో కెమెరా చిహ్నం గా మారి ఆ సందేశాన్ని రికార్డ్ చేసి సెండ్ చేసుకోవచ్చు.


3). మనం ఏదైనా విషయాలను గోప్యంగా ఉంచాలి అంటే వాట్సాప్ లాక్ ని చేసుకోవచ్చు.. ఇది వ్యక్తిగతంగా లాక్ చేయబడిన ప్రతి చాటుకు పాస్వర్డ్ ని సెట్ చేసుకోవచ్చు..


4). వాట్సప్ చాట్లను డిఫాల్ట్ గా ఎన్ స్క్రిప్ట్ చేయబడతాయి.. వీటికి బ్యాకప్ లు ఉండవు.. కానీ ఈ చాట్లను హై క్లౌడ్ లేదా గూగుల్ డ్రైవ్ వంటి వాటిలో స్టోర్ చేసుకొని మనం తిరిగి పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: