ప్రస్తుతం దేశంలో చాలా మంది ఎక్కువగా డిజిటల్ చెల్లింపులను చేస్తూనే ఉన్నాము.. ముఖ్యమైన లావాదేవీలు బ్యాంకింగ్ యాప్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి.. అయితే ఇది అదునుగా సైబర్ నేరగాళ్లు చూసుకొని రోజురోజుకి సైబర్ నేరగాళ్ల బారిన పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. కొన్ని తప్పుడు లింకులు క్లిక్ చేయడం లేదా ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేసి వారి యొక్క ఖాతా నుంచి మరొక ఖాతాలోకి డబ్బులను బదిలీ చేసుకుంటున్నారు.. ఇలాంటి కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి..


దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన ఒక నెంబర్ ను సైతం జారీ చేసింది. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సైబర్ నేరానికి గురైనట్లు అయితే వెంటనే..1930 నెంబర్ కి డయల్ చేయాలి.. అక్కడ మీ UPI ఐడి లేదా బ్యాంకు ఖాతాను లింకు చేయబడిన నెంబర్ నుండి సైబర్ క్రైమ్ కు కాల్ చేయాలి.. ఈ నెంబర్ డైరెక్ట్ గా సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టంకి లింక్ అవుతుందట..


అయితే ఈ నెంబర్ కి ఫోన్ చేసి మోసానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది.. అయితే ఇక్కడ మాత్రం ATM పిన్ నెట్ బ్యాంకింగ్ వంటి వివరాలను మాత్రం అడగరు.. అలాగే అటువంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు.. మీ పేరు చిరునామా మోసం చేసిన విధానం అట్టి సమయం మాత్రమే అడుగుతారు. మీ నెంబర్ కాల్ చేసిన తర్వాత మీ ఫిర్యాదు పైన వెంటనే చర్యలు తీసుకుంటారు.. మీ ఖాతా నుంచి విత్ డ్రా అయిన డబ్బులను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నెంబర్ ఉచితంగానే చేసుకోవచ్చు.. సైబర్ క్రైమ్ యొక్క ఫిర్యాదును సైతం ఎలాంటి సమయాలలో నైనా వీటిని ఉపయోగించుకోవచ్చుని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: