మనలో చాలామంది కొత్త మొబైల్ కొన్నప్పుడు చార్జింగ్ బాగా వస్తూ ఉంటుంది..అయితే గడిచిన కొద్ది రోజుల తర్వాత మొబైల్ వినియోగించే కొద్దీ ఈ బ్యాటరీ పనితీరు చాలా తగ్గిపోతూ ఉంటుంది. దీంతో చార్జింగ్ విషయంలో చాలామంది ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలా మొబైల్ చార్జింగ్ త్వరగా అయిపోవడానికి కారణం మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే అని చెప్పవచ్చు.. అంతేకాకుండా మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల. ఇతర చార్జర్లను ఉపయోగించడం వాళ్ల .. చార్జింగ్ వైర్ ని అలాగే ఆన్ లో ఉంచడం.. ఇతర తప్పులను చేస్తూ ఉంటాము.


అయితే వీటి వల్ల కూడా బ్యాటరీ పనితీరు చాలా దెబ్బతింటుందట. పదేపదే ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోతూ ఉంటే మీ మొబైల్ లో ఇలాంటి సెట్టింగ్లను సరి చేస్తే సరిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట స్క్రీన్ టైమ్ ని పరిమితంగా ఉంచుకోవాలి.. ఎందుకంటే మొబైల్ ఫోన్ ఉపయోగించకుంటే.. లేదా ఉపయోగించిన తర్వాత కూడా అలాగే ఎక్కువసేపు ఆన్లోనే ఉంటే బ్యాటరీ త్వరగా పూర్తి అవుతుంది.. అందుకే స్క్రీన్ ఆఫ్ టైమ్ ని 15 లేదా 30 సెకండ్ల లోపు సెట్ చేసుకోవాలి.


మొబైల్ బ్రైట్నెస్ స్క్రీన్ ని ఆటోమేటిక్ ఆప్షన్లు పెట్టుకోవడం మంచిది.. ఒకవేళ బ్రైట్నెస్ ఎక్కువగా పెంచితే త్వరగా బ్యాటరీ అయిపోతుంది. ఐమోడ్ ని కూడా ఆన్ చేసుకోవడం వల్ల  కళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చాలామంది కీబోర్డ్ టైప్ చేసేటప్పుడు సౌండ్ చేస్తూ ఉంటారు. దీంతో వైబ్రేషన్ సౌండ్ వల్ల అధిక బ్యాటరీని వినియోగిస్తాయట. మన మొబైల్లో సెట్టింగ్ లోకి వెళ్లిన తర్వాత ఏ యాప్ ను మనం ఎక్కువగా వినియోగిస్తున్నామో చూసి... ఆ యాప్ ను కనీసం రెండు మూడు నెలలకు ఒకసారి అయినా ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ వంటివి చేస్తూ ఉండాలి. అవసరం లేని సమయాలలో డార్క్ మోడ్ ఆప్షన్ ని ఆన్ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువ రోజులు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: