ఫాస్ట్ ట్యాగ్ అనేది వాహనం ఉన్న వారందరికీ కచ్చితంగా ఉపయోగకరమే. చిన్న మరియు పెద్ద చెల్లింపుల నుంచి ఎక్కువగా paytm వంటి వాటిని కూడా ఉపయోగిస్తూ ఉంటాము.ఫాస్ట్ ట్యాగ్ అనేది కూడ పేటీఎం ఖాతాకు లింకు చేయబడి ఉంటుంది. ఇటీవల ఆర్.బి.ఐ పేటీఎం బ్యాంక్..PPBL పై పలు రకాల నియంత్రణ చర్యలు తీసుకుంది. దీనివల్ల పేటీఎంలో FASTAG తో సహా అన్ని సేవలు కూడా ప్రభావితాన్ని చూపుతున్నాయి. అందుచేతనే పేటీఎంలో ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉన్న వారికి ఎటువంటి మార్పులు ఉంటాయని విషయాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


ఒకవేళ మీరు పేటీఎంలో ఫాస్ట్ ట్యాగ్ ను డి యాక్టివేషన్ చేయాలనుకున్నప్పటికీ లేదా ఖాతాను పోర్టు చేయాలనుకుంటున్నారా ఇది తెలుసుకోవాల్సిందే.. ఫిబ్రవరి 29 తర్వాత PPBL డిపాజిట్లు లేదా టాప్ కస్టమర్ల ఖాతాలు వాలెట్లు ఫాస్ట్ ట్యాగ్ ఇతర ఉత్పత్తులను సైతం స్వీకరించడాన్ని ఆపివేశారు. సేవింగ్ బ్యాంకు ఖాతాలతో సహా ఇతర బ్యాంకుల నుంచి బ్యాలెన్స్ సైతం ఉపయోగించడానికి కస్టమర్లకు అనుమతించబడతారు.. ప్రీపెయిడ్ ఉత్పత్తులు, ఫాస్ట్ ట్యాగ్ మరియు నేషనల్ కామన్ మెబిలిటీ కార్డుల సైతం బ్యాలెన్స్ ఉన్నంతవరకు మాత్రమే పనిచేస్తాయి.

PAYTM ఫాస్ట్ ట్యాగ్ ను ఎలా డియాక్టివేషన్ చేయాలంటే.. ముందుగా మనం ఫాస్ట్ ట్యాగ్ paytm హోటల్లో లాగిన్ అయిన తర్వాత యూజర్ ఐడి, వాలెట్ ఐడి పాస్వర్డ్ నమోదు చేయవలసి ఉంటుంది.

ఆ తర్వాత ఫాస్ట్ ట్యాగ్ నెంబర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు వెరిఫికేషన్ కోసం ఇతర వివరాలను కూడా ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత స్క్రోల్ చేసి హెల్ ప్ ఎంపిక పైన క్లిక్ చేయాలి..

అక్కడ నేను నా ఫాస్ట్ ట్యాగ్ ను మూసివేయాలను కుంటున్నానని ప్రశ్న పైన ఎంపిక చేయాలి.. అయితే ఒక్కసారి డి యాక్టివేషన్ చేస్తే మళ్ళీ అదే ఫాస్ట్ ట్యాగ్ ఓపెన్ చేయడం కుదరదు.

మరింత సమాచారం తెలుసుకోండి: