ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దీంతో ఎన్నికల కమిషనర్సు ఇప్పటికే ఓటర్ల జాబితాలను కూడా విడుదల చేశారు.. ప్రజలు ఓటు వేయాలంటే కచ్చితంగా ఓటర్ ఐడి కార్డు ఉండాలి అయితే అందులోని వివరాలు కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓటర్ ఐడి కార్డులో అడ్రస్ తప్పుగా ఉండిపోయిన వాటిని చేంజ్ చేసుకుని అవకాశం ఉన్నది. అయితే ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది.


నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్సైట్ కి వెళ్లి.. అందులో కొత్త అడ్రస్సును అప్డేట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఓటర్ ఐడి కార్డు అడ్రస్ మార్చుకోవాలి అంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది..

మొదట నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత అందులో ఫారం -8 కనిపిస్తుంది.. దీని ద్వారానే ఓటర్ ఐడి కార్డు లోని మార్పులు చేర్పులు చేసుకోవాలి.

https://voter's.eci.gov.in/ వెళ్లి లాగిన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ క్యాప్షన్ ఎంటర్ చేయాలి. దీని ద్వారానే మీరు సైట్ లోకి వెళ్తారు.


హోం స్క్రీన్ పైన వెళ్లి ఫారం-8 పైన క్లిక్ చేయాలి.. షిఫ్టింగ్ ఆర్ రెసిడెంట్ /రీప్లేస్మెంట్ ఆఫ్ ఈపీఐసీ అని రాసి ఉన్న ఫారం 8 పైన కనిపిస్తుంది వాటిపైన క్లిక్ చేయాలి.


ఆ తర్వాత దరఖాస్తు ఎవరికోసం అడుగుతున్నారు సెల్ఫ్ అధర్ సెలక్షన్ల ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి.


ఆ తర్వాత ఓటర్ ఐడి కార్డు నెంబర్ను ఎంటర్ చేసి.. మీ పేరు ఇతర వివరాలను మరొక బాక్సులో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ స్క్రీన్ పైన సిఫిటింగ్ ఆఫ్ రెసిడెన్సి ఆప్షన్ ఎంచుకోవాలి.

ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని లేక స్థానాన్ని చేంజ్ చేసుకోవడం వంటి ఆప్షన్లను అడుగుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పూర్తి చిరునామాను టైప్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఏదైనా ప్రూఫ్ ని(గ్యాస్ కనెక్షన్, కరెంట్ బిల్, బ్యాంకు పాస్ బుక్ ,రెవెన్యూ కార్డ్ ) ఏడాది పాటు ఒకే చోటు ఉన్నట్టు పలు రకాల పత్రాలను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా మన ఓటర్ ఐడి కార్డు లోని పేరును అడ్రస్సులను అన్నిటిని కూడా మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: