మీరు వాడే స్మార్ట్ ఫోన్ లో కనుక వైరస్ ఉంటే మీరు యాంటీ వైరస్ సహాయంతో ఆ వైరస్‌ను ఈజీగా తొలగించవచ్చు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ తప్పులను నివారించడం వలన మీ స్మార్ట్ ఫోన్‌ను వైరస్‌ల నుండి చాలా ఈజీగా సురక్షితంగా ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.మనలో చాలా మంది వ్యక్తులు కూడా కొన్నిసార్లు తెలియని లింక్‌పై క్లిక్ చేస్తారు. ఈ చిన్న పొరపాటు ఖచ్చితంగా పెద్ద ఇబ్బందులకు దారి తీస్తుంది. అలాంటి కొన్ని లింకులు చాలా అంటే చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఇలాంటి ఈ ప్రమాదకరమైన లింక్‌లు ఖచ్చితంగా మీ స్మార్ట్‌ఫోన్‌లలో వైరస్‌లను ఇన్‌స్టాల్ చేయగలవు. అందుకే తెలియని లింక్‌లపై అస్సలు క్లిక్ చేయవద్దు.మీకు ఏదైనా తెలియని ఇమెయిల్, మెసేజ్ లేదా ఎవరైనా వాట్సాప్‌లో లింక్‌ను షేర్ చేసినట్లయితే అది ఏమిటో చూడటానికి ఆ లింక్‌ని క్లిక్ చేసి తెరవకండి.


ఇప్పుడు ఇలాంటి నకిలీ లింక్‌ల బెడద చాలా ఎక్కువైంది.ఇంకా అలాగే ఎలాంటి అనుమానాస్పద వెబ్‌సైట్‌ను కూడా ఓపెన్ చేయవద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఫోన్‌కి వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ. అలాంటి వెబ్ సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత, ఏదైనా లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్‌లో వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది.ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఇంకా ఆపిల్ ఐఫోన్‌కు యాప్ స్టోర్ ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని యాప్‌లు నకిలీవి. మీరు ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా చెక్ చేయండి. ఆ యాప్ బ్యాక్ గ్రౌండ్ ఖచ్చితంగా తెలుసుకోని  కొనసాగించండి.ప్రస్తుత కాలంలో హోటళ్లు లేదా రెస్టారెంట్లతో సహా చాలా ప్రదేశాలలో ఉచిత Wi-Fi అనేది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ వైఫైని ఉపయోగించడం మీ ఫోన్‌లో రిస్క్‌ పెరుగుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్రీ వై-ఫైకి కనెక్ట్ చేసిన వెంటనే, వైరస్‌లు ప్రవేశించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటి పట్ల జాగ్రత్త వహించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: