ప్రస్తుత కాలంలో ఎక్కువమంది స్మార్ట్ మొబైల్ ని వినియోగిస్తున్నాము. అయితే మొబైల్ బ్యాటరీ లైఫ్ అనేది త్వరగా అయిపోతుందని చాలామంది విసుకు చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఎన్నోసార్లు చార్జింగ్ చేయవలసి ఉంటుంది.. కానీ మొబైల్ సెట్టింగ్లను మారిస్తే బ్యాటరీ త్వరగా అయిపోదట.. మన మొబైల్లో ఉన్న రిఫ్రెష్ రేట్ ఫీచర్ గురించి చాలామందికి తక్కువగా తెలియకపోవచ్చు ఈ ఫీచర్ వల్ల మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుందని పలువురు నిపుణులు తెలుపుతున్నారు.


మొబైల్ రీ ఫ్రెష్ రేట్ ఎంత సెట్ చేసుకోవాలో కూడా తెలియని వారు ఉన్నారని.. ముఖ్యంగా మొబైల్లో రిఫ్రెష్ రేట్ ఎంత ఉండాలి ఎక్కువ ఉంటే బ్యాటరీ బ్యాకప్ ఎలా చెడిపోతుందో తెలుసుకుందాం.. రిఫ్రేస్ రేట్ మొబైల్ యొక్క బ్యాటరీ జీవితం పైన ఎలా ప్రభావాన్ని చేస్తుందంటే.. రిఫ్రెష్ రేట్ అనేది బ్యాటరీ కి స్క్రీన్ కి సంబంధించినది. మొబైల్ స్క్రీన్ ఒక సెకనులో ఎన్నిసార్లు రిఫ్రెష్ అవుతుందో దానినే రిఫ్రెష్ రేట్ అంటారు. మొబైల్ స్మూత్ గా నడవడానికి రిఫ్రెష్ రేట్ చాలా ముఖ్యమైనది.


మరొకవైపు రిఫ్రెష్ రేటు ఫోన్ బ్యాటరీని త్వరగా అయిపోయేలా చేస్తుందట.. చాలా మొబైల్స్ లో సెట్టింగ్ లో డిస్ప్లే ఎంపిక విషయంలో ఈ ఫీచర్ ని చూసి ఉంటారు డిస్ప్లే ఎంపికలు ఈ ఫీచర్ కనిపించకుంటే సెట్టింగ్స్లోకి వెళ్లి ఈ ఫీచర్ ని చూడవచ్చు. మీ మొబైల్ 120 HZ వరకు రిఫ్రెష్ రేట్ మద్దతు ఇస్తే మీ మొబైల్ ఫోన్ లో 60HZ,120HZ,90HZ రిఫ్రెష్ రేట్ వరకు మనం చేంజ్ చేసుకోవచ్చు.. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే మీరు ఎంత తక్కువ రిఫ్రెష్ రేటును సెట్ చేస్తే బ్యాటరీ లైఫ్ కూడా అంత ఆదా అవుతుంది.. ఒకవేళ అధికంగా ఉన్నటువంటి రీఫ్రెష్ రేట్ సెట్ చేసుకుంటే మీ మొబైల్ బ్యాటరీ వేగవంతంగా అయిపోవడమే కాకుండా చాలా స్మూత్ గా మొబైల్ రన్ అవుతుంది. బ్యాటరీ జీవితకాలం తగ్గడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఈ రిఫ్రెష్ రేటు కూడా ఒకటని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: