ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం ఎక్కువగా నడుస్తోంది.. మారిన టెక్నాలజీతో పాటు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూనే ఉన్నారు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి కూడా చేతిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉండాల్సిందే.. ఈ స్మార్ట్ ఫోన్ తో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.. చిన్నారులు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.. అనివార్య కారణాలవల్ల మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది కచ్చితంగా అందులో కొన్ని యాప్స్ ను ఉండేలా చూసుకోవాలట..


ఇలాంటి యాప్స్ ఉండడం వల్ల మీ పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు ఎలాంటి యాప్స్ ఉపయోగిస్తున్నారు అనే వాటిని తెలుసుకోవచ్చు.. మీ పిల్లల ఫోన్లో ఉండాల్సిన యాప్స్ లో..google family link యాప్స్ సెట్ చేసుకోవడం మంచిది. అలాగే మీ పిల్లలు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని కూడా ఇందులో తెలుసుకోవచ్చు.. ఈ యాప్స్ సహాయంతో చిన్నారులు  వినియోగించే బ్రౌజింగ్ కంట్రోల్ ను కూడా మనం చేయవచ్చట.

Kids lox యాప్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది పిల్లలలోని సోషల్ మీడియా యాప్సులను సైతం బ్లాక్ చేయడమే కాకుండా అలాగే మనం ఎంపిక చేసిన వెబ్సైట్లను కూడా బ్లాక్ చేస్తుంది...


Narthan Family premier : ఈ యాప్స్ పిల్లల యొక్క స్మార్ట్ మొబైల్ ను కంట్రోల్ చేస్తుందట. సోషల్ మీడియాలో పిల్లలకు ఏవైనా సంబంధించి వేధింపులు వచ్చిన మిమ్మల్ని వెంటనే అలా చేయడానికి ఈ యాప్ సహాయపడుతుంది.. అలాగే ఫోన్లో ప్లే అవుతున్నటువంటి వీడియోలను కూడా మనం చూడవచ్చు..


Qustodio:
పిల్లలు ఏ యాప్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఏ యూట్యూబ్ వీడియోలను చూస్తున్నారు ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు వంటివి ఈ యాప్స్ వల్ల ట్రాక్ చేయవచ్చు.. అందుకనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు సైతం పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు ఈ యాప్స్ ను ఇన్స్టాల్ చేసి మీ మొబైల్ కి లింక్ చేసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: