గడచిన కొన్ని నెలల నుంచి ఫోన్ ట్యాపింగ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది.. అయితే సాధారణంగా కొంతమంది అసాంఘిక శక్తుల ఫోన్లను మాత్రమే పోలీసులు ఇలా ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. పలు రకాల ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ల ద్వారా కూడా మొబైల్స్ ను ట్యాపింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవలే పలు రకాల ఆరోపనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎవరిదైనా మొబైల్ ఇలాంటి ట్యాపింగ్ కు గురైనట్టు అయితే కొన్ని అంశాల ద్వారా వాటిని గుర్తించవచ్చట. వాటి గురించి తెలుసుకుందాం.


1). మొబైల్ కాల్స్ వచ్చినప్పుడు మాట్లాడుతున్న సమయంలో ఎలాంటి శబ్దాలు వినిపించిన లేదా మరే ఇతర సౌండ్స్ వినిపించిన ట్రాకింగ్ లేదా ట్యాపింగ్ జరుగుతున్నట్లు గుర్తించాలి.. వీటితోపాటు మొబైల్ ఉపయోగించకుండా వేడెక్కుతుంటే బ్యాక్ గ్రౌండ్ లో డేటా ట్రాన్సిమిషన్  జరుగుతున్నట్లు గుర్తించాలి.


2). కొన్నిసార్లు మొబైల్ ఫోన్ వినియోగిస్తున్న సమయంలో అనుకోకుండా డిస్ప్లే ఆఫ్ కావడం ఆన్ కావడం.. నోటిఫికేషన్ సౌండ్ వినిపించడం వంటివి వస్తే.. కచ్చితంగా ఆ మొబైల్ మాల్వేర్ ఇన్స్టాల్ చేయబడి ఉంటుందట.


3). మీ అనుమతి లేకుండా మొబైల్ కెమెరా మైక్రోఫోన్ యాక్టివేషన్ అయ్యిందంటే కచ్చితంగా ఎవరు మీ మొబైల్ ని యాక్సెస్ చేస్తున్నట్లుగా భావించాలి.

4). స్మార్ట్ మొబైల్ డేటా వినియోగం పెరిగిన కాస్త అనుమానించాలి అలాగే కొన్ని స్పై యాప్స్ మీ డేటాను సేకరించి ఇతరులకు బదిలీ చేస్తూ ఉంటారు. దీనివల్లనే డేటా ఎక్కువగా వినియోగం అవుతుందట.


ఇలాంటి ట్యాపింగ్ బారిన పడకుండా ఉండాలి అంటే.. ఖచ్చితంగా మొబైల్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తూ ఉండాలి. అధికారిక యాప్స్ మాత్రమే డౌన్లోడ్ చేయాలి. పబ్లిక్ వైఫై నెట్వర్క్ ని ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే థర్డ్ పార్టీ యాప్స్ లను ఉపయోగించకపోవడమే చాలా మంచిది.. కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా మీ పర్సనల్ డేటా సంబంధించి పాస్వర్డ్లను మారుస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: