నిన్నటి రోజు నుంచి కొన్ని మొబైల్స్ స్క్రీన్ పై కొన్ని మార్పులు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాల్ చేస్తే పెద్దపెద్ద అక్షరాలు వచ్చేస్తున్నాయి. స్క్రీన్ పైన యాడ్ కాల్ ,వీడియో కాల్ ,రికార్డింగ్ హోల్డ్, ఆల్ కాల్స్, యాడ్ మై కెమెరా, అలా మరికొన్ని స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని చూసి మొదట చాలా మంది ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తన మొబైల్ కి ఇలా వస్తోందా లేకపోతే ఏదైనా స్కామ్ కి గురయ్యామా అనే విధంగా ఆలోచిస్తున్నారు.అయితే దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఇదంతా కూడా కేవలం అప్డేట్లో ఒక భాగం అని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.


ముఖ్యంగా వన్ ప్లస్, మోటో, ఒప్పో, రియల్ మీ వంటి ఫోన్లలో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల కాలింగ్ ఇంటర్ ఫేజ్ మెరుగుపరచడానికే ఇలా అప్డేట్ కొనసాగుతోందని తెలియజేస్తున్నారు. గూగుల్ స్టాక్,  ఆండ్రాయిడ్, ఆపరేటింగ్ సిస్టం లో కూడా న్యూ ఫీచర్స్ ని ఇంటర్డ్యూజ్ చేస్తున్నాయట పలు రకాల బ్రాండ్స్. ఇందులో భాగంగానే ఇలాంటి అప్డేట్లు విడుదల చేస్తున్నారట.


వన్ ప్లస్:OXYGEN -12,13  యాప్ డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ఇందులో సైడ్ స్లైడ్ తో పాటు స్పామ్ ఫిల్టరింగ్ ఫీచర్ కూడా జోడిస్తారు.

ఒప్పో:
Color OS -12,13 మొబైల్స్ లో సొంత డైలార్ ప్యాడ్ స్పామ్ గుర్తించి సైడ్ స్లయిడ్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

రియల్ మీ:
REALME UI 3.0,4.0 వర్షన్ కలిగిన మొబైల్స్లలో ఇంటిగ్రేట్ ఆటోమేటిక్గా చేసుకుంటుందట. అయితే కొన్ని సిరీస్లలో మాత్రం సొంత డయలర్ స్పామ్ డిటెక్షన్ ఫీచర్ ని జోడించారు.


మోటో:
మోటరోలా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇంటర్ ఫేస్ సరికొత్తగా అందిస్తోంది. దీనివల్ల యూజర్స్ కూడా సరికొత్త ఫీచర్స్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

స్పామ్ కాల్స్ గుర్తించడానికి ఈ బ్రాండ్స్ అన్ని కూడా ట్రూ కాలర్స్ లేదా google స్పామ్ ప్రొటెక్షన్ ని యూజ్ చేస్తున్నాయి.. కానీ ఇక మీదట స్పామ్ కాల్స్ బ్లాక్ చేసేందుకు డు నాట్ డిస్టర్బ్ సెట్టింగ్ ఆన్ చేస్తే సరిపోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: