చాలామంది కారు కొనేటప్పుడు మ్యాన్యువల్ గేర్ లేదా ఆటోమేటిక్ గేర్ కలిగి ఉన్న కార్లలో ఏ కారు కొనాలనే విషయంపై సందేహ పడుతూ ఉంటారు. అయితే ఈ విషయం పైన ఒక నిర్ణయం ఇచ్చేందుకు కొంతమంది నిపుణులు కొన్ని విషయాలను పరిగణంలోకి తీసుకొని మరి తెలియజేస్తున్నారు. మరి అవసరాలకు తగ్గట్టుగా ఏ కారును ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


ఆటోమేటిక్ గేర్:

కారుని ముందుకు నడపడానికి.. డ్రైవ్ మోడ్ (డి) ఉంటుంది. అలాగే రివర్స్ చేయడానికి ( R) రివర్స్ మోడ్ ఉంటుంది.. అలాగే కారును న్యూట్రల్ గా ఉంచడానికి (N) మోడ్ కలిగి ఉంటుంది. మాన్యువల్ గేర్లు కలిగిన కారుతో పోలిస్తే ఆటోమేటిక్ గేర్ లలో ఉన్న కారు ధర ఎక్కువే ఉంటుంది. ఆటోమేటిక్ కార్లలో గేర్ల వ్యవస్థ చాలా సంక్లిష్టంగానే ఉంటుంది. రిపేరు కోసం కొంతమేరకు ఎక్కువగానే డబ్బులు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్ల కారు మైలేజ్ విషయంలో కూడా తక్కువగానే ఉంటుంది. డ్రైవర్ కు కారు తోలిన అనుభూతి కనిపించదు.


అయితే ఆటోమేటిక్ కార్లు నడపడం సులభం. గేర్లు వాటంతట అవే మారుతూ ఉంటాయి. కాబట్టి డ్రైవర్ కు ఎలాంటి శ్రమ ఉండదు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి చాలా సులువుగా ఉంటాయి. జర్నీలలో కూడా కుదుపులు చాలా తక్కువగానే ఉంటాయి.


మాన్యువల్ గేర్:
ఈ వాహనాలు చాలా కాలం నుంచి ఉపయోగిస్తున్నారు.కారు తోలేవారు ప్రతిసారి క్లచ్ ని కాలితో ఒత్తుతూ  గేర్లు మార్చాలి. ఎక్కువ ప్రయాణాలలో ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతంలో విసుకు చెందేలా చేస్తుంది. కొత్తగా నేర్చుకునే వారికి ఈ కారు నడపడం కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా క్లచ్, యాక్సిలేటర్ , బ్రేకుల మధ్య ఖచ్చితమైన అవగాహన ఉండాలి ఎలాంటి విషయంలోనైనా పొరపాటు చేస్తే  అంతే సంగతులు.


మాన్యువల్ కారు ధరల విషయానికి వస్తే ఆటోమేటిక్ కార్లతో పోలిస్తే చౌకగానే ఉంటుంది. ఈ కార్లు మైలేజీ కూడా ఎక్కువగానే ఇస్తాయి. రోడ్డు సరిగ్గా లేని ప్రాంతాలలో ప్రయాణం మరింత సులువుగా ఈజీగా అవుతుంది. ఈ కార్లకు రిపేర్లు ఖర్చు తక్కువగానే ఉంటుంది.


మ్యానువల్ కార్లతో పొందే అంత డ్రైవింగ్ అనుభవం.. ఆటోమేటిక్ కార్లలో ఉండదని చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: