సాధారణంగా యువతీ యువకులు పెళ్లి ఎప్పుడు చూసుకుందాం? అని చర్చించుకుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే తమ జీవిత భాగస్వామి ఒకసారి దొరికినట్లయితే అనగా మ్యాచ్ కుదిరితే గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకుంటారు. ఇందుకుగాను ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ ఇతర అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవాలనుకుంటారు. స్నేహితులు, బంధుమిత్రులు అందరి సమక్షంలో ఈ వేడుకు జరగాలనుకుంటారు. అయితే, వీరందరూ ఉండగా పెళ్లి వధువుతో కాకుండా ఒక మేకతో జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వెరీ డిఫరెంట్‌గా ఉంటుంది కదా..అలానే జరిగింది ఓ పెళ్లి వేడుక. సదరు కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వైభవంగా జరిగిన ఈ పెళ్లి వివరాలు ఈ స్టోరీ చదివి మీరూ తెలుసుకోండి.


పెళ్లి కొడుకు మేకతో పెళ్లి చేసుకోవడాన్ని వైరల్ అవుతున్న వీడియోలో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కాగా, ఈ వేడుకలో వరుడు హుషారుగా కనిపించడం విశేషం. పాకిస్తాన్‌ దేశంలోని సింధు ప్రావిన్స్‌లో ఈ మ్యారేజ్ జరిగింది. ఇరవైదు ఏళ్ల యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఘనంగా ఈ వేడుక జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ రిలేటివ్స్ అందరూ ఈ వివాహమహోత్సవానికి తరలి రావడంతో పాటు వధూవరులను ఆశీర్వదించారు. వరుడితో వధువు అయినటువంటి సదరు మేక ఏడడుగులు నడవడం గమనార్హం. సాధారణంగా మనుషులకు అయితే ఈ తంతు గురించి తెలుస్తుంది. జంతువులకు ఏం తెలియదు కదా.. అందుకే ఓ వ్యక్తి మేకను ఏడు అడుగులు నడిపించాడు. వరుడి వెనకాల మేక ఏడు అడుగులు నడవడం విశేషంగానే అనిపిస్తుంది. అయితే, మేకను చూసి రిలేటివ్స్ అందరూ నవ్వుకోవడంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ తతంగాన్ని వీడియో రూపంలో రికార్డు చేయగా, పనౌతి అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నెటిజనాలు వీడియో చూసి తెగనవ్వుకుంటున్నారు. డిఫరెంట్ ట్రెడీషన్ అని కామెంట్స్ చేస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: