జెట్ ఏంటి..? నేషనల్ హైవే పైన ల్యాండ్ అవడం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా..? నిజమే ..ఈరోజు అనగా 2021 సెప్టెంబర్ 9 గురువారం రోజున రాజస్థాన్ లోని జాతీయ రహదారి అయిన NH925A లో భారత వైమానిక దళం ఒక అద్భుతమైన ఘనతను సాధించింది.. సుఖోయ్ సు- 30 MKI ఫైటర్ జెట్ భారత వైమానిక దళంలో అత్యంత గుర్తింపు పొందిన జెట్ ఇది. ఇక ఈ రోజు జాతీయ రహదారిపై ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి. జాతీయ రహదారిపై జెట్ ను ల్యాండ్ చేసి ఘనత సృష్టించారు.

కేవలం సుఖోయ్ సు- 30 MKI ఫైటర్ జెట్ తో పాటు IAF C -130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా  జలోర్ లోని అత్యవసర ల్యాండింగ్ ఫీల్డ్ లో ల్యాండ్ చేసి రికార్డు సృష్టించారు. ఈ విమానంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్డు రవాణా మంత్రి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ కె ఎస్ భదౌరియా  తో పాటు పలువురు ప్రయాణికులు కూడా ఉండడం గమనార్హం.

కేంద్ర మంత్రులు రాజ్ నరసింహ అలాగే నితిన్ గడ్కరీ నేషనల్ హైవే NH925A లో రాజస్థాన్ లోని బార్మేర్ లో మొదట అత్యవసర సదుపాయాన్ని ప్రారంభించారు. ఇలా ప్రారంభించినప్పుడు ఐఏఎఫ్ కార్యకలాపాలకు ప్రేక్షకులు కూడా హాజరు కావడం గమనార్హం. ఏది ఏమైనా ఇలా మొదటిసారి ఫైటర్ జట్ లను నేషనల్ హైవేపై  ల్యాండ్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీతో ప్రయాణికుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని , అత్యవసర పరిస్థితుల నుండి ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకురావాలి అని, ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ప్రయాణించిన పలువురు మంత్రులు ,ప్రయాణికులతో పాటు ఫైటర్లు కూడా చాలా ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: