అస‌లు గ్ర‌హాంత‌వాసులు ఉన్నారా లేరా..? అనేది ఎవరికీ అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌గానే మిగిలిపోతుంది. విదేశాల్లో మాత్రం అందుకు భిన్నంగా త‌మ‌ను ఏలియ‌న్స్ ఎత్తుకెళ్లార‌ని పేర్కొంటుంటారు. అందులో ఒక‌రైన షాన్ జార్జ్ రైడ‌ర్ (59). ఈయ‌న పాపుల‌ర్ సింగ‌ర్‌, సాంగ్ రైట‌ర్‌, క‌వి. స్టార్ సెలబ్రిటీగా పేరొందిన షాన్ ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు. అక్క‌డ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించాడు. ఏలియన్స్ తో త‌న‌కు ఎంతో అనుబంధం ఉంద‌ని.. త‌న‌కున్న అనుబంధాన్ని ఫోన్ ద్వారా చూపించాడు. గ‌తంలో ఎప్పుడో 15 ఏండ్ల కింద‌ట ఓ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని.. అది ఇంకా గుర్తుంద‌ని వివ‌రించాడు. నింగిలోకి ఎగిరే ప‌ళ్లాన్ని నేను తొలిసారి చూశాన‌ని.. నాతో పాటు మ‌రో అబ్బాయి కూడా ఉన్నాడ‌ని వివ‌రించాడు.

ఆకాశంలో యూఎఫ్ఓలు సైతం క‌నిపించాయ‌ని.. నాకు అంతా చీక‌టిమ‌యంగా క‌నిపించింద‌ని, అదంతా ఒక ఊహ‌లా ఒక క‌ల‌లాగా అనుకున్నాను. కానీ ఆ త‌ర్వాత నాకు అస‌లు విష‌యం అర్థ‌మైంది న‌న్ను ఏలియ‌న్స్ ఎత్తుకెళ్లార‌ని చెప్పుకొచ్చారు షాన్ రైడ‌ర్‌. అయితే ఎగిరే ప‌ళ్లాల‌పై షాన్ రైడ‌ర్ మిని సిరీస్ డాక్యుమెంట‌రీ సైతం చేశారు. భ‌విష్య‌త్‌లో భూమి గురించి ఆలోచ‌న ఏమిట‌నే అంశాల‌పై ఆయ‌న సిరీస్‌లో వెల్ల‌డించాడు. త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లోని గార్డెన్‌లో ఓ చెట్టుపై ప్లాస్టిక్ వ‌స్తువు క‌నిపించింది. అది వేలాడుతుంటే తాను ఆశ్చ‌ర్య‌పోయాను. త‌ర్వాత మా ప్రొడ‌క్ష‌న్ టీమ్ ఏర్పాటు చేశార‌నుకున్న‌. కానీ అది మెల్ల మెల్ల‌గా మేఘంలా మారింది. కొద్ది కొద్దిగా పెరుగుతూ చివ‌రకు క‌నిపించ‌కుండా పోయిందని తెలిపాడు.

ఇదిలా ఉండ‌గా 2021 ఆగ‌స్టులో షాన్ జార్జ్ రైడ‌ర్‌కు క‌రోనా వ్యాధి సోకింది. దాదాపు మూడు వారాల‌కు పైగా క‌రోనాతో పోరాడాడు. అదే స‌మ‌యంలో గ్ర‌హాంత‌ర‌వాసులు త‌న వద్ద‌కు వ‌చ్చి షాన్ ఏమి ప‌ర్వాలేదు, నీ ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌ని చెప్పిన‌ట్టు క‌ల వ‌చ్చింద‌ని వెల్ల‌డించాడు. అంత‌రిక్షం నుంచి వ‌చ్చిన ఏలియ‌న్స్ ను తాను చూసిన‌ట్టు.. వారితో మాట్లాడిన‌ట్టు.. క‌లిసి వెళ్లిన‌ట్టు వివ‌రించారు. కానీ వాట‌న్నింటికి ఎలాంటి ఆధారాలు మాత్రం లేవు. ఏలియ‌న్స్‌ను క‌లిసిన‌ప్పుడు అంతా ఒక ఊహ‌లాగా ఉంటుంద‌ని చెప్పారు. దీంతో కొంత మంది మాత్రం ఆయ‌న నిజంగా ఏలియ‌న్స్‌ను క‌లిసి ఉండ‌ర‌ని త‌మ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గ్ర‌హాంత‌ర‌వాసులు తీసుకెళ్లార‌ని చెప్పుకునే వారి జాబితాలో షాన్ జార్జ్ రైడ‌ర్ ఒక‌రుగా ఉన్నారు.  మొత్తానికి షాన్ రైడ‌ర్ చేసిన ఈ షాకింగ్ విష‌యాలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: