ప్రస్తుతం పెరుగుతున్న ఒత్తిడి పనిభారం వల్ల.. మనుషులు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్న పరిస్థితులలో ఉన్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని కనుక్కునేందుకు ఒక స్మార్ట్ వాచ్ ని తయారు చేయడం జరిగింది కొంతమంది పరిశోధకులు.. ఈ స్మార్ట్ వాచ్ ఒత్తిడిని ఒక గంట సమయానికి ముందే ఆ వ్యక్తికి హెచ్చరిస్తోందట. ఇక ఈ స్మార్ట్ వాచ్ ఈ పేరు..NOWWATCH . దీని వలన ఒక వ్యక్తికి గురయ్యే.. ఒత్తిడిని గుర్తించి కొన్ని సూచనలు, సలహాలను అందజేస్తుంది.

మన శరీరంలో ఉండే ఒత్తిడి వల్ల హార్మోన్ కొలస్ట్రాల్ ను విడుదల చేస్తుంది.. ఇక ఈ స్మార్ట్ వాచ్ ఈ హార్మోన్లను.. ట్రాక్ చేస్తూ ఉంటుంది.. ఇక ఎవరైనా వ్యక్తి ఈ స్మార్ట్ వాచ్  ధరించినట్లయితే.. అతని అని శరీరంలో నుండి వెలువడే చెమట ద్వారా తనిఖీ చేయడం జరుగుతుంది.. మన శరీరంలోని హార్మోన్ స్థాయి బాగా పెరిగినప్పుడు వెంటనే గుర్తించి ఇది మనకి స్పందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ స్మార్ట్ వాచ్ ఉపయోగించుకుంటున్న వ్యక్తి.. ఒత్తిడికి గురవుతున్నాడు లేదా అనే సమాచారాన్ని కూడా ఈ వాచ్ ట్రాక్ చేస్తూ ఆడియో రూపంలో మనకి అందిస్తుందట.

ఉదాహరణకు ఈ వాచ్ ధరించిన వ్యక్తి శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. శ్వాస తీసుకోవాలని తెలియజేస్తుందట.. అలాంటి సమయంలో కాస్త పైకి లేచి కొద్దిదూరం నడవండి అంటు కూడా సలహా ఇస్తోందట. ఇలా చేయడంతో కాస్త ఒత్తిడి తగ్గిపోతుంది.. ఒత్తిడికి గురైనప్పుడు ఈ స్మార్ట్ వాచ్ అందించే హెచ్చరికలను పొందడం ద్వారా.. మానవులలో ఒత్తిడిని మొదటి దశలోనే గుర్తించి వాటిని నియంత్రించవచ్చని ఈ స్మార్ట్ వాచ్ తయారీ చేసిన సంస్థ వారు తెలియజేస్తున్నారు.ఇక ఈ స్మార్ట్ వాచ్ చెమట ద్వారా ఎలా గుర్తిస్తుంది అంటే. వాస్తవానికి డేటా అల్గోరిథం ఎలక్ట్రానిక్  అనే ఒక సెన్సార్ పరికరాన్ని..NOWWATCH లో ఇన్స్టాల్ చేయబడినదట.. ఇది మనిషి ఒత్తిడిని ముందుగానే గుర్తించి సహాయ చేస్తోందట. దీని ధర 57 వేల రూపాయలు. 2023 మార్చి కి ఈ వాచ్ మార్కెట్లోకి అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: