కొన్ని కొన్ని సార్లు ఆకాశం లో ఎవరూ ఊహించని విధంగా అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆకాశంలో ఏలియన్స్ స్పేస్ షిప్ లో వచ్చి అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు అని ఒక టాక్ కూడా ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా అంటే మాత్రం ఎవరికీ కచ్చితమైన సమాధానం తెలియదు అని చెప్పాలి. ఏలియన్స్ ఉన్నాయని ఇక  ఎప్పుడో ఒకసారి భూమ్మీదికి వస్తాయని మనుషులు అందరూ కూడా నవ్వుతూ ఉంటారు.


 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఆకాశంలో వింతైన ఘటనలు జరుగుతూ ఉండటం లాంటివి జరిగినప్పుడు నిజంగానే ఏలియన్స్ ఉన్నాయ్ అని ప్రతిఒక్కరూ నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. అయితే రాత్రి సమయంలో కొన్నిసార్లు ఆకాశానికి చూసినపుడు నక్షత్రాలు ఆకాశం నుంచి భూమి మీద పడిపోతున్నాయేమో అనే విధంగా కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. మరో అద్భుతమైన వింతైన దృశ్యం కనిపించింది అని చెప్పాలి.  ఏకంగా అలాంటి ఒక వస్తువు మండిపోతూ ఆకాశంలో దూసుకెళ్లడానికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది.


 స్కాట్లాండ్  ఉత్తర ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆకాశంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. చిన్నపాటి అగ్నిగోళం లాంటి ఒక వస్తువు ఆకాశంలో కనిపించింది. అది మంటలు విరజిమ్ముతూ ఎంతో వేగంగా దూసుకు పోయింది. ఈ క్రమంలోనే ఇది చూసిన వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. ఇక దూసుకు పోయిన వస్తువు ఏకంగా ఖగోళనికి చెందిన  రాకెట్ లా  కనిపించింది అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం  చేస్తున్నారు.  వైరల్ గా మారిన వీడియో చూసిన నెటిజన్లకు కూడా అది ఏంటో అర్థం కావడం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోపై ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: