ఒకప్పుడు మనుషులు జనసంచారం ఉన్న ప్రాంతాలలో.. జంతువులు వాటి ఇల్లు అయిన అడవిలోజీవనం సాగిస్తూ ఉండేవి. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇందులో మార్పు వచ్చింది. మనిషి స్వార్థం కోసం అడవులను నరికేస్తూ ఇక ఆయా ప్రాంతాలలో పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తూ ఉంటే ఈ అడవుల్లో ఉండే జంతువులు ఏకంగా జనావాసాల్లోకి వస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిరుతపులులు అయితే ఇటీవల కాలంలో తరచూ జనాభాసాల్లోకి వస్తూ పశువులపై దాడి చేసి ప్రాణాలు తీసేయడం ఎంతో మందిని గాయపరచడం లాంటివి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలా చిరుత పులులు ఏకంగా జనావాసాల్లోకి వస్తున్న వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఇలాంటివి చూసి ఇక అడవులకు సమీప ప్రాంతాల్లో ఉన్నవారు భయంతో వనికి పోతున్నారు అని చెప్పాలి. ఇక ఇలా చిరుతపులను జనాభాసాల్లోకి వచ్చాయి అంటే చాలు ఇక దానిని తరిమికొట్టేందుకు ప్రజలు కాస్త ధైర్యం చేసి ముందడుగు వేస్తున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా జనావాసాల్లోకి వచ్చిన చిరుత పులిని  చూసిన స్థానికులు దానిపై రాళ్లు రూవ్వారు.  దీంతో చిరుత పులి తీవ్ర భయాందోళనకు గురి అయింది. దీంతో అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ప్రాణభయంతో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద ట్విటర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. భవనంపై ఉన్న జనం రాళ్లు రూవ్వడంతో భయపడిపోయిన  చిరుత రోడ్డు వైపు పరిగెత్తింది. అటువైపుకు వెళ్తున్న వాహనదారుడుని ఢీకొట్టింది. దీంతో అతను కిందపడి గాయాల పాలయ్యాడు. ఆ తర్వాత మరో వ్యక్తిపై చిరుత తిరగబడింది. ఆందోళనలో ఉన్న చిరుతను గందరగోళానికి గురి చేయడంతోనే ఇలా దాడి చేసిందని ఫారెస్ట్ అధికారి ఒక కామెంట్ రాసుకోవచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: