ఈ భూమ్మీద ఉండే ప్రమాదకరమైన జీవులలో మొసలి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. సింహం అడవికి రారాజు అయితే అటు నీటిలో ఉంటే మాత్రం సింహాన్ని కూడా భయపెట్టే బలాన్ని కలిగి ఉంటుంది మొసలి. అయితే కొన్ని కొన్ని సార్లు జంతువులు సింహాలు దాడి చేసిన వాటి నుంచి తప్పించుకోగలవేమో కానీ.. ఒక్కసారి నీటి మాటున దాగి ఉన్న మొసలి అటాక్ చేసిందంటే మాత్రం దాని పట్టు నుంచి తప్పించుకొని ప్రాణాలను రక్షించుకోవడం దాదాపు అసాధ్యం అని చెప్పాలి. కేవలం క్షణాల వ్యవధిలోనే దాడి చేసి ఏకంగా జంతువుల ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది. ఇక కొన్ని కొన్ని సార్లు ఏకంగా మనుషులపై మొసలి దాడి చేయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 అది సరేగాని ఇప్పుడు ఆ ప్రమాదకరమైన మొసలి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి అనే కదా మీ డౌట్ సాధారణంగా మొసల్లు అటు నీళ్లల్లో ఉన్నాయి అంటే ఎంతో ధైర్యంగా ఉంటాయి. అదే భూమ్మీద ఉంటే ఇక అవి కూడా కాస్త భయపడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే నీళ్లలో ఉన్నప్పుడు ఉన్నంత బలం అటు భూమ్మీద ఉన్నప్పుడు ఉండదు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఒక మొసలికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఒక భారీ మొసలి ఎలాంటి భయం వెలుగు లేకుండా దర్జాగా రోడ్డు దాటుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అమెరికాలోని సౌత్ కరోలినాలో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. అయితే ఒక్కసారిగా మొసలి రోడ్డు మీదికి రావడంతో అటువైపుగా సైకిల్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు భయపడిపోయారు. వెంటనే సైకిల్ని పక్కకు ఆపి ఇక మొసలి రోడ్డు దాటుతున్న వీడియోని సెల్ఫోన్ లో బంధించడం మొదలుపెట్టారు అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. మనుషులు కూడా అంత దర్జాగా రోడ్డు దాటరేమో మొసలి మాత్రం ఏకంగా తనకోసమే స్పెషల్గా రోడ్డు వేయించారు నాకేంటి భయం అన్న విధంగానే రోడ్డు దాటుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: