సోషల్ మీడియా అభివృద్ధి చెందాక అనేక రకాల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వాటిలో ఎక్కువగా పెళ్లి వేడుకలకు సంబంధించినవి ఉంటాయి. పెళ్లి సందర్భంగా వధూవరులు చేసే డాన్స్ వీడియోలు కూడా ఉంటూనే ఉన్నాయి.ఇక ఈ పెళ్లి వీడియోలను  నెటిజన్లు ప్రత్యేక ఆసక్తితో చూస్తూ ఉంటారు. ఆ వీడియోలు వైరల్ కావడానికి ఆ ప్రత్యేక ఆసక్తే కారణం. కొన్నేళ్ల క్రితం దాకా కూడా చాలా మంది పెళ్లి అంటే ఏదో తెలయని ఆలోచనతో ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో వారు ఏకంగా పెళ్లి మండపాలపైనే డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది చాలా సాధారణ విషయంగా మారిపోయింది అని కూడా చెప్పుకోవాలి. పెళ్లిలో వరుడి కోసం వధువు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అయితే అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తమ నవ్వుని ఆపుకోలేకపోతున్నారు.అయితే ఇక ఈ పెళ్లి వీడియో ప్రత్యేకత ఏమంటే ఈ వీడియోలో వధువుతో పాటు వరుడు కూడా డ్యాన్స్ చేస్తాడు.


ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలకు ఇది చాలా భిన్నంగా ఉంది.ఆ పెళ్లికూతురు తనను చూసిన తర్వాత కొన్ని సెకన్ల పాటు డ్యాన్స్ చేస్తుందని ఆ వరుడు భావించాడు. కానీ ఆమె డ్యాన్స్ ప్రారంభించిన తర్వాత ఇక ఆపకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంది. దీంతో ఆ వరుడు కూడా ఊపందుకుని ఇక కాలు కదిపాడు. ఇక ఇద్దరూ కూడా ఒకే సమయంలో ఒకే మ్యూజిక్‌కు వేర్వేరు స్టెప్పులు వస్తూ అందరినీ కూడా ఎంతగానో నవ్వించారు. కానీ కాసేపటి తర్వాత ఆ వరుడి బ్యాటరీ డౌన్ అయిపోయి పక్కకు వెళ్లి కూర్చున్నాడు.ఇక అలా సాగిన ఈ వీడియోను ట్విట్టర్‌లోని @anamika943 అనే యూజర్ షేర్ చేశారు. ఇక ఈ వీడియోని ఇప్పటి దాకా ఏకంగా 2 లక్షల 25వేలకుపై మంది వీక్షించగా ఇంకా 6 వేల వరకూ లైకులు వచ్చాయి. ఇంకా నెటిజన్లు కూడా ఈ వీడియోకు చాలా సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: