అన్నం లేకున్నా పరవాలేదు కానీ.. టీ లేకుండా ఉండలేం బాబో అనే వారు కూడా ఉన్నారు. అలాంటి టీ ఓ బల్లి గుటకలు వేసుకుంటూ తాగడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా గోడల మీద తిరిగే బల్లి ఉదయం నిద్రలేవగానే ఓ కప్పు టీ తాగి ఆ తర్వాత వేట మొదలుపెడుతుంది. మరి బల్లి టీ ఎలా తాగుతుంది. ఎవరు తయారు చేసిస్తారు అనే సందేహం తప్పకుండా వస్తుంది. బల్లి టీ తయారు చేసుకోలేదు కదా అందుకని ఆ ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో పాటు కప్పు టీ బల్లికి కూడా ఇస్తుందట.
భరత్‌పూర్‌లోని ఓ మహిళ ప్రతిరోజూ కుటుంబ సభ్యులకు టీ చేసి కప్పులో పోసి తాగండని టేబుల్ మీద పెడుతున్నది. ఒకరోజు ఎవరూ సమయంలో బల్లి ఆ కప్పులోని టీ తాగుతుండడం ఆ ఇంటి యజమానురాలు గమనించి మొదట ఆశ్చర్యపోయిందట. ఆహా ఈ బల్లి కూడా టీ రుచి నచ్చినట్టు ఉందని ఆ రోజు నుంచి బల్లికి కూడా టీ తాగాలని ఉంటుంది కదా అని కప్పులో పోసి పక్కన పెడుతుంది. బల్లికి, మహిళకు మంచి అండర్‌స్టాడింగ్ కుదిరింది. ఇంకేముంది రోజూ కుటుంబ సభ్యులకు టీ ఇచ్చేటప్పుడు బల్లికి కూడా ఇస్తుంది. గత రెండు నెలల నుంచి ఆ బల్లి కూడా కుటుంబంలో భాగమైంది. ఇదొకటే కాదు రెండేళ్ల కిందట కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకున్నది.