ఇండియా హెరాల్డ్  అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కుక్కలు చాలా విశ్వాసమైన ప్రాణులు. అవి వాటి  యజమానుల కోసం ఎంత త్యాగం అయినా చేస్తాయి. చివరికి వాటి ప్రాణాలైనా ఇస్తాయి. అలాంటి కుక్కలకి ఆపద వస్తే యజమానులు ఏమి చేస్తారు. కొంతమంది వాటికోసం అంత రిస్క్ తీసుకోరు.  అయితే కొంతమంది  యజమానులు మాత్రం  తాము ఎంతో ప్రాణంగా  ఇష్టపడే కుక్కల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యరని  చెప్పడానికి ఆస్ట్రేలియాలోని క్వీన్‌ల్యాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం.ఆ యజమాని పలువురికి ఆదర్శవంతంగా నిలిచింది..

సన్‌షైన్ కోస్ట్‌లో నివసిస్తున్న మిచెల్లె వ్యాన్ స్కౌవెన్ 9 నెలల కుక్క పిల్లను చాలా ముద్దుగా అపురూపంగా  పెంచుకుంటోంది. ఇటీవల ఆ కుక్క పిల్ల ఆహారం తినేందుకు బయటకు వచ్చింది. అప్పటికే పొదల్లో పొంచివున్న కార్పెట్ పైథాన్ (కొండ చిలువ)... ఒక్కసారి దానిపై దాడి చేసింది. తన పదునైన కోరలతో కుక్క పిల్లను పట్టుకుని.. శరీరంతో చుట్టేసి.. చంపేందుకు ప్రయత్నించింది.

ఇక తన కుక్క పిల్ల అరుపులు విన్న యజమానురాలు  మిచెల్లె హుటా హుటిన  బయటకు వచ్చింది. తన చేతిలో క్రిస్టమస్ పేపర్ రోల్ పట్టుకుని కొండ చిలువను కొట్టింది. అప్పటికీ అది వదలకపోవడంతో కొండ చిలువను చేతితో పట్టుకుని విడిపించింది. దీంతో కుక్క పిల్ల ప్రాణాలతో బయపడింది. ఆ తరువాత  ఆ కొండ చిలువను అడవుల్లో వదిలిపెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొండ చిలువ కుక్క పిల్లపై దాడి చేస్తున్న ఘటన ఈ కింది వీడియోలో ఉంది. మీరు చూసేయండి. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: