ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి...మాములుగా ఒక మనిషి స్నానం చెయ్యకుండా ఎన్ని రోజులు ఉండగలడు.. మహా అంటే ఒక రెండు రోజులు రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు స్నానం చెయ్యకుండా ఉంటే బాబోయ్ ఇక ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇక ఒక వ్యక్తి అయితే స్నానం చెయ్యకుండా 67 సంవత్సరాలు బ్రతికాడట. అది కూడా పచ్చి మాంసం తిని అన్ని సంవత్సరాలు బ్రతికాడట. ఇక అసలు విషయానికి వస్తే..ఆ వ్యక్తి పేరు అమౌ హజీ.అతని వయస్సు 87 సంవత్సరాలు. 20 ఏళ్ల వయస్సు నుంచే అతడు స్నానం చేయడం మానేశాడు. అతడిని సడన్‌గా చూస్తే.. విగ్రహం అనుకుంటారు. ఇరాన్‌లోని దేజ్గా‌ అనే గ్రామంలో నివసిస్తున్న హాజీని ప్రపంచంలోనే అత్యంత అపరిశుభ్ర వ్యక్తిగా పరిగణిస్తున్నారు. అతడు కేవలం పరిశుభ్రత విషయంలోనే కాదు.. తినే ఆహారం విషయంలో కూడా అంతే ‘డర్టీ’గా ఉంటాడు. ఎందుకంటే ఈ వ్యక్తి చనిపోయిన జంతువుల కుళ్లిన మాంసాన్ని తినడానికి మాత్రమే ఇష్టపడతాడు. అదే అతడు రోజూ తీసుకొనే ఆహారం. హజీకి స్మోకింగ్ అంటే చాలా ఇష్టం. అయితే, అతడు పీల్చేది పొగాకు కాదు.. జంతువుల మలాన్ని. బాగా ఎండిపోయిన మలాన్ని తుప్పు పట్టిన పైపులో వేసుకుని మరీ అతడు స్మోక్ చేస్తాడు. మరి, హజీ ఎందుకు ఇలా జీవిస్తున్నాడు? అతడి జీవితంలో ఏమైంది?

హాజీకి నీళ్లంటే భయం. స్నానం చేస్తే అనారోగ్యానికి గురవ్వుతాడనే భయమట.. ఫోబియాగా అతడికి మారింది. అంతే.. అప్పటి నుంచి నీటి చుక్క కూడా తన శరీరంపై పడకుండా జాగ్రత్తపడుతున్నాడు. 20 ఏళ్ల వయస్సులోనే హజీ ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి తలపై యుద్ధంలో సైనికులు పెట్టుకొనే హెల్మెట్ ధరిస్తున్నాడు. చలికాలంలో అది అతడిని వెచ్చగా ఉంచుతుందట.అతడి కోసం జనాలు ఇటుకలతో చిన్న గూడు కట్టారు. అయితే, అతడు అందులో ఉండకుండా నేలపై గోతులు తవ్వి.. అందులోనే జీవిస్తున్నాడు. స్నానమైతే చేయడు సరే.. కనీసం నీళ్లైనా తాగడా అంటే రోజుకు కనీసం ఐదు లీటర్ల నీటిని గడగడా తాగేస్తాడు. హాజీ తన జుట్టును మనలా కత్తెరతో కాకుండా నిప్పుతో కత్తిరించుకుంటాడు. ఇప్పుడు అతనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: