ఆయన ఓసారి దక్షిణాఫ్రికాలోని యానిమల్ రిజర్వ్‌ను సందర్శించారు. అక్కడ ఏనుగులను సంరక్షించే ఓ వ్యక్తి.. వాటి ఆహారం గురించి అన్‌స్లేస్‌కు వివరించాడు. ఏనుగులు ఆహారం విషయంలో చాలా కచ్చితంగా ఉంటాయని తెలిపాడు. అయితే, అవి తినే ఆహారంలో సగం కంటే తక్కువ మేతను మాత్రమే శరీరానికి తీసుకుంటాయని, మిగతా సగం చెక్కుచెదరకుండా మలం ద్వారా బయటకు వచ్చేస్తుందని వివరించాడు. దీంతో అన్‌స్లేస్‌కు ఈ ఆలోచన కలిగింది. ఏనుగుల మలాన్ని సరికొత్త జిన్‌లో సహజ పదార్థంగా ఎందుకు ఉపయోగించకూడదని అనుకున్నారు. కానీ, ప్రయత్నించలేదు.
దక్షిణాఫ్రికాలో ఎక్కువగా అమ్ముడుపోయే ‘ఇండ్లోవు’ అనే జిన్ అంటే మద్యం ప్రియులు నాలుక కోసుకుంటారు. అక్కడి భాషలో ఇండ్లోవు అంటే ఏనుగు అని అర్థం. ప్రిమియం స్పిరిట్‌లలో ఒకటైన ఈ జిన్ తయారీకి ఏనుగు మలం ఉపయోగించడం వల్ల.. ఆ బ్రాండ్‌కు ఆ పేరు పెట్టారు.ఏనుగు శాఖాహారి అనే సంగతి తెలిసిందే. అది అనేకరకాల మొక్కలు, చెట్లను ఆహారంగా తీసుకుంటుంది. పలురకాల వేర్లు, గడ్డి, పండ్లు, బెరడులు, కలబంద, అకాసియా వంటివి తింటుంది. అయితే, వాటిని పూర్తిగా జీర్ణించుకోకుండా పోషకాలన్నీ మలం ద్వారా బయటకు వదిలేస్తుంది.అందుకే ఆ జిన్ అంత రుచిగా ఉంటుందని అన్‌స్లేస్ తెలిపాడు.ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది 2018లో. అయితే, మొదటి ఏనుగు మలం జిన్ బాటిల్ ఉత్పత్తి మొదలైంది మాత్రం 2019 నవంబరు నెలలో. తొలుత ఈ జిన్ గురించి మిశ్రమ స్పందన వచ్చింది. ఆఫ్రీకా, యూరప్ దేశాల్లో పలువురు దీన్ని రుచి చూడటానికి ముందుకొచ్చారు.
రుచి వారికి నచ్చడంతో తయారీ కూడా ఉపందుకుంది. దీంతో తయారీదారులకు మాంచి లాభాలు వస్తున్నాయి. అలా వచ్చిన ఆదాయంలో 15 శాతం మొత్తాన్ని ఏనుగుల సంరక్షణ కోసం ఆఫ్రికా ఫౌండేషన్‌కు అందిస్తున్నారు.
ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి