ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. 13 ఏళ్ళు పైనే కావస్తున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. ఓ పక్క సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోపక్క కుర్ర హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ ఇప్పటికీ బిజీ హీరోయిన్ గా బిజీ బిజీ అయిపోయింది.కాజల్ మొదటగా లక్ష్మీ కళ్యాణం చిత్రంతో ఎంట్రీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. చందమామ చిత్రంలో అదిరిపోయే అందాలు ఆరబోసి రాజమౌళి కంట్లో పడింది. అంతే మగధీర చిత్రంతో ఒక్కసారిగా పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది అనే చెప్పాలి.
అక్కడి నుంచి ఈ హాట్ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.వరుస సినిమాలతో ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ తరువాత కూడా ఈమె ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేస్తూ వచ్చినప్పటికీ అదే స్థాయిలో నటిగాను రాణిస్తుంది. అయితే గతేడాది అక్టోబర్ ఎండింగ్ లో తన బాల్య స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న కాజల్..ఈ మధ్య కాలంలో స్మోకింగ్ కూడా చేస్తున్నట్టు కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. గత మూడు రోజులుగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలు చూసిన ఈమె అభిమానులు షాక్ కు గురయ్యారు.నిజంగా కాజల్ కు స్మోకింగ్ హ్యాబిట్ ఉందా అంటూ అయోమయానికి గురయ్యారు. అయితే కాజల్ నిజంగా స్మోకింగ్ చెయ్యలేదు. లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించిన కాజల్.. దాని కోసం స్మోకింగ్ ఎపిసోడ్స్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుండడం విశేషం.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి