ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సాధారణంగా భార్యలకు భర్తల మీద అనుమానం ఎక్కువగా ఉంటుంది. తను లేనప్పుడు తన భర్త ఏం చేస్తాడో ఎవరితో వున్నాడో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు...ఇక విషయానికి వస్తే...మాగీ క్లేటన్ అనే మహిళ ఆఫీస్‌లో పని పూర్తి చేసుకుని ఇంటికి బయల్దేరింది. ఇంటికి చేరుకొనేసరికి లోపలి నుంచి పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వినిపించింది. దీంతో ఆమె కిటికీ అద్దంపై పడుతున్న నీడను పరిశీలనగా చూసింది. అంతే.. ఆమెకు గుండె జారినంత పనైంది. ఆ నీడ ఓ అమ్మాయిది. జుట్టు విరబూసుకుని గెంతులు వేస్తున్నట్లు కనిపించింది. దీంతో భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోడానికి ఆమె తన మొబైల్ తీసి తన భర్త చేసే ఘన కార్యాన్ని షూట్ చెయ్యాలనుకుంది..


ఇక మొబైల్ ని తీసి వీడియోను రికార్డు చేస్తూ ఇంట్లోకి వెళ్లింది. అయితే, అక్కడ సీన్ వేరేగా ఉంది. అసలు ఇంట్లో అమ్మాయే కనిపించలేదు. ఆమెకు జుట్టు విరబూసుకున్నట్లు కనిపించిన నీడ ఆమె భర్తదే. అతడు తన స్నేహితుడితో కలిసి రాక్‌స్టార్ తరహాలో పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా తన జుట్టు పొడవుగా కనిపించేందుకు విగ్ ధరించాడు. అతడిని చూడగానే మాగీ నోట మాట రాలేదు. జరిగింది తలచుకుని పగలబడి నవ్వింది.


ఇక ఆమె ఆ వీడియోను ‘టిక్‌టాక్’లో పోస్ట్ చేసింది. ఫన్నీ సంఘటన గురించి తన ఫాలోవర్లు, స్నేహితులకు వివరించింది. ఈ వీడియో చూసి నెటిజనులు తెగ నవ్వేస్తున్నారు. ‘‘ఇది గ్రేటెస్ట్ ట్విస్ట్’’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. మరొకరు ‘‘మగాళ్లు ఎప్పుడూ మగాళ్లే.. ఒక్కోసారి ఇలాంటి ట్విస్టులు కూడా ఇస్తుంటారు’’ అని తెలిపింది. ‘‘అయ్యో.. నీ అనుమానం వ్యర్థమైపోయిందే’’ అని ఇంకొకరు కామెంట్ చేశారు.ఇలా రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.. ప్రస్తుతం ఇది బాగా ట్రెండింగ్ లో వుంది..ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...

https://youtu.be/2vlZDGEnaF0



మరింత సమాచారం తెలుసుకోండి: