ప్రస్తుతం కరోనా మహమ్మారి ఘోరంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్ లు వాడటం చాలా ముఖ్యం. ముఖ్యంగా శానిటైజర్ వాడటం చాలా ముఖ్యం.అయితే ఇవి మనకు అందుబాటు ధరలలోనే దొరుకుతాయి. కాని వీటిని కూడా దొంగిలించే కక్కుర్తి గాళ్ళు వున్నారు.అలాంటి కక్కుర్తి వ్యక్తి వీడియో బయట పడింది.ఇక విషయానికి వస్తే ఏటీఎంలకు వెళ్లేప్పుడు తప్పకుండా శానిటైజర్ తీసుకెళ్లాలి. లేకపోతే.. మీ కంటే ముందు డబ్బులు తీసుకున్న వ్యక్తికి కరోనా ఉండి ఉంటే.. అది ఏటీఎం ద్వారా మీకు సోకే ప్రమాదం ఉంది. అయితే, అందరూ తమ వెంట సానిటైజర్ తీసుకెళ్తారనే గ్యారంటీ లేదు. అలాంటివారి కోసం బ్యాంకులే ఏటీఎంల్లో సానిటైజర్లు ఏర్పాటు చేస్తారు. ఇక ట్విట్టర్ లో ఐపీఎస్ అధికారి దీపాంసు కబ్రా ఇటీవల ఓ వీడియోను ట్వీట్ చేశారు. బ్యాంకు ఏటీఎంలో ఏర్పాటు చేసిన ఓ సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియో అది. అందులో ఓ కస్టమర్ డబ్బులు డ్రా చేసుకోడానికి ఏటీఎంకు వచ్చాడు. అందులో కస్టమర్లు చేతులు శుభ్రం చేసుకోడానికి ఏర్పాటు చేసిన సానిటైజర్ బాటిల్ మీద అతడి కన్ను పడింది. అతడు డబ్బులు డ్రా చేస్తున్నాడేగానీ.. దృష్టంతా ఆ శానిటైజర్ బాటిల్ మీదే ఉంది.


డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత.. అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో ఆ శానిటైజర్ బాటిల్ తీసేసి తన బ్యాగులో పెట్టేసుకుని చల్లగా జారుకున్నాడు. 33 సెకన్ల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దయచేసి మీరు మాత్రం ఇలాంటి పని చేసి పరువు తీసుకోవద్దు. ఈ కరోనా సమయంలో తోటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా సురక్షితంగా ఉంటామనే విషయాన్ని గుర్తుంచుకోండి. లేకపోతే వైరస్ వ్యాప్తికి పరోక్షంగా మీరు కూడా కారణమవుతారు.కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యంతో పాటు మీ వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకోవడం మీ బాధ్యత.కాబట్టి మీరూ కూడా కక్కుర్తి పడకుండా ఈ వ్యక్తి లాగా శానిటైజర్ దొంగిలించి పరువు పోగొట్టుకొని ఇలా వైరల్ అవ్వకండి...



మరింత సమాచారం తెలుసుకోండి: