ఇక చికెన్ అంటే ఇష్టపడని మాంసాహారి ఉండడు. కొంతమందికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక ఇంట్లో పెంచుకునే నాటుకోడి అయితే ఇక చెప్పనవసరం లేదు. ఆ కోడి ముక్క తింటుంటేనే ప్రాణం జివ్వు మంటుంది.ఇక ఆదివారం, సోమవారం అనే తేడానే లేకుండా చికెన్ లాగించేస్తుంటారు మాంసాహార ప్రియులు. అయితే చికెన్ ని కోసే క్రమంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది.ఆ ఇన్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ తెగ వైరల్ అవుతుంది.ఇంట్లోనే బాగా ఏపుగా పెరిగినా ఓ నాటు కోడి పుంజుని కొయ్యడానికి అందుకున్నాడు ఓ వ్య‌క్తి. ఇక ఆ కోడి పుంజుని మ‌రో వ్యక్తి సాయంతో దాని గొంతు కోసే పని ప్రారంభించాడు.ఇక ముందుగా వారు ఆ కోడి పుంజు నోట్లో నీళ్లు పోశారు. ఇక ఆపై ఒక‌ వ్యక్తి దాన్ని గ‌ట్టిగా ప‌ట్టుకోగా  మ‌రొ వ్య‌క్తి క‌త్తి తీసుకొని దాని మెడ తెంపేశాడు. అయితే పూర్తిగా దాని మెడ తెంపలేదు. ఇక ఆ కోడి మెడ‌ స‌గం కోశాక‌ చాలా ర‌క్తం కార‌డంతో అది ఇక ఎక్క‌డికి వెళ్తుందిలే చనిపోయి ఉంటుందని కింద పెట్టేశారు.ఇక వ‌దిలి పెట్టారో లేదో దెబ్బకి అది అలా లేచి జంప్ అయ్యింది.


ఇక ఆ కోడి పుంజుని ప‌ట్టుకునేందుకు ఆ ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా దాని వెనుక‌ ప‌రిగెత్తారు. కాని కొనప్రాణంతో ఉండ‌టం వ‌ల్లే ఆ కోడి పుంజు పరిగెత్తి ఉండొచ్చ‌ని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఆ కోడి పుంజుకి బాగా బ్లీడింగ్ అయ్యి తరువాత దాని ప్రాణం పోయి ఉండొచ్చు. ఇక ఈ ఫన్నీ ఘటన తెలంగాణ‌లోని నల్లగొండ జిల్లాలో నార్కట్ పల్లి చోటుచేసుకుంది. ఇక సగం మెడ తెగాక‌ పారిపోయిన నాటుకోడి పుంజు వీడియో ఇప్పుడు సామాజిక మీడియోలో తెగ చ‌క్క‌ర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది. ఇక ఆ నాటు కోడిపుంజు కత్తితో కోసిన తరువాత దొరక్కుండా అలా పరిగెత్తడం ప‌ట్ల నెటిజ‌న్లు ఈ కోడి పుంజు నిజంగా గట్టిదే. కోళ్ల పందెంలో నిలిస్తే ఇక ప్రత్యర్థి కోడి పుంజు చిత్తు చిత్తే అని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఆ కోడి గట్టిదనం చూసి నెటిజన్స్ ఎంతో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.అదే మనం అయితే చిన్న వేలు తెగిన కుయ్యో ముర్రో అంటాం. కాని ఈ కోడి మాత్రం సగం మెడ తెగిన కాని శరవేగంగా పరిగెత్తి పారిపోయింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూసేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: