ఉద్యోగరీత్యా ఆ అధికారి ఛత్తీస్గఢ్లో ఉంటుండగా భార్యా పిల్లలు మాత్రం బింద్ నగరంలో వుంటున్నారు. ఇక జూన్ 30 వ తేదీన భార్యా పిల్లలు ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరికి వెళ్లారు. అయితే వారు తిరిగి వచ్చేసరికి ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అలాగే ఆ ఇంట్లో సామాన్లు అన్నీ కూడా ఎలా పడితే అలా పడి ఉన్నాయి.ఇంట్లో వున్న విలువైన వస్తువులను దొంగిలించిన ఆ దొంగ.. ఓ క్షమాపణ లెటర్ ని కూడా వదిలి వెళ్ళాడు. తన మిత్రుడి ప్రాణం కాపాడటానికి అనివార్యంగా ఈ దొంగతనం చేస్తున్నానని అందులో రాశాడు.ఇక త్వరలో డబ్బు రాగానే దొంగతనం చేసిన ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తానంటూ అందులో రాశాడు.ఇక ఈ ఘటనపై బింద్ నగర పోలీసులు కేసును నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనంలో తెలిసిన వారి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి